దిల్ రాజుకు షాక్... మహర్షి రిలీజ్‌కు ముందు ఆఫీసుపై ఐటీ దాడులు.. నాన్ బాహుబలి రికార్డుపై!
Recommended Video
మహర్షి సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఏం జరిగిందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం రిలీజ్‌కు ముందు ప్రెస్‌మీట్ పెట్టి సినిమాపై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో
మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అదనపు షోకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ టికెట్ల రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వానికి మా మధ్య మిస్ కమ్యూనికేషన్ ఏర్పడింది.

రెండు రాష్ట్రాల్లో స్పెషల్ మార్నింగ్ షోలు
తెలంగాణలో ఉదయం 8 గంటలకు సినిమాలు చేసే అలవాటు లేదు. ఆంధ్రాలో ఉదయం 1 గంటకు వేసినా ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తారు. కాబట్టి ఏపీలో ఉదయం 5 గంటలకే మహర్షి సినిమా షో పడుతుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాం అని అన్నారు.

టికెట్ల రేట్లు పెంపుతో
టికెట్ల రేట్లు పెంపు విషయంలో కొంత గందరగోళం నెలకొన్నది. థియేటర్ ఓనర్లు ప్రభుత్వం నుంచి కాకుండా కోర్టు నుంచి టికెట్ల పెంపుపై అనుమతి తెచ్చుకొన్నారు. దాంతో రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరిగాయి. రూ. 80 ఉంటే రూ.100 చేశారు. టికెట్ ధర రూ.110 ఉంటే రూ.125 చేశారు. మల్టీప్లెక్స్‌లో రూ.150 ఉంటే రూ.200 చేశారు అని వివరణ ఇచ్చారు.

దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీదాడులు
ఇదిలా ఉండగా, దిల్ రాజు ఆఫీస్‌పై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించినట్టు తెలిసింది. మహర్షి బిజినెస్, ఖర్చుల వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. అంతేకాకుండా మిగితా నిర్మాతల ఆఫీసులపై, నివాసాలపై దాడులు జరిగినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, పీవీపీ, సీ అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

నాన్ బాహుబలి రికార్డుతో
మహర్షి సినిమాను భారీ రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇది నాన్ బాహుబలి సినిమాల క్యాటగిరీలో ఇదో రికార్డు. కలెక్షన్ల వివరాలు, సినిమా వసూళ్ల రేంజ్ గురువారం తెలుస్తుంది అని దిల్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











