Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిల్ రాజు చేతుల మీదుగా నితిన్ ‘కల్యాణం’.. ఇంట్రెస్టింగ్ న్యూస్
Recommended Video
యువ కథానాయకుడు నితిన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త సినిమా నిర్మించబోతోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి "శ్రీనివాస కల్యాణం" అనే పేరు నిర్ణయించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
14 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్
14 ఏళ్ల క్రితం దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. నితిన్‌ను ఆ చిత్రం మరోస్థాయికి తీసుకెళ్తింది. అలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
దుమ్మురేపిన శతమానం భవతి
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన శతమానంభవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం'గా స్వర్ణకమలం అవార్డ్ అందుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
2018 మార్చిలో షూటింగ్
2018 మార్చిలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్రావణ మాసంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే మరిన్ని వివరాలు
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియచేస్తామని యూనిట్ తెలియచేసింది.