twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్, అనిల్ రావిపూడి చిత్రానికి అతడే నిర్మాత!

    |

    సూపర్ స్టార్ మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తాడు. అందుకే మహేష్ కు కథ చెప్పి ఒప్పించడానికి చాలా మంది దర్శకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం మహర్షి చిత్రంలో వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి కథావినిపించగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

    ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మహర్షి తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శత్వంలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుకు సరిపడే కథ సిద్ధం చేయడానికి సుకుమార్ కు మరో 6 నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఈలోపు మహేష్ అనిల్ రావిపూడి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

     Dil Raju to produce Mahesh Babu, Anil Ravipudi movie

    ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని అంటున్నారు. ప్రస్తుతం మహర్షి చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించారు. మహర్షి చిత్రం ఏప్రిల్ లో విడుదలవుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ చిత్రానికి సంబందించిన పనులు షురూ అవుతాయి.

    English summary
    Dil Raju to produce Mahesh Babu, Anil Ravipudi movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X