సునీల్ హీరోగా దిల్ రాజు భారీ చిత్రం..డిటేల్స్

By Srikanya

దిల్ రాజు,సునీల్ కాంబినేషన్ లో సినిమా మార్చి 25 వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఇదేమీ సునీల్ కి కొత్త ప్రాజెక్టు కాదు. గణేష్ ఇందుకూరితో చేద్దామనుకున్న నెపోలియన్ సినిమానే ఇటు షిప్ట్ అయింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవటంతో టాలీ టు హాలీ బ్యానర్ పై చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ మొదటి సారిగా ఎయిట్ ప్యాక్ లుక్ తో కనపడనున్నాడు. రాజమౌళి దగ్గర అశోసియోట్ గా పనిచేసిన కోటి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కానున్నాడు. సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేసారు.

ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు చిత్రం క్రిందటివారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరోగా నెపోలియన్ చిత్రం సునీల్ కి నాలుగవది. ఈ చిత్రంపై సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X