దిల్ రాజు 50వ ప్రాజెక్ట్.. రామ్ చరణ్ 15వ సినిమా.. శంకర్‌తో వేరే లెవెల్ ప్లానింగ్
ఓ క్రేజీ కాంబో రాబోతోందంటే కొన్ని సూచనలు వస్తుంటాయి. అసలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన లీకులు ఎక్కడా రాకపోయినా.. అధికారిక సమాచారం ఏమీ లేకపోయినా సరే ఓ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. రామ్ చరణ్ 15వ చిత్రం గురించి గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. RC15 పేరిట నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. మొత్తానికి రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్‌పై అప్డేట్ రానే వచ్చింది.

అలా ప్రచారాలు..
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ కూడా త్వరలోనే పూర్తి కాబోతోన్నాడు. ఆ తరువాత రామ్ చరణ్ ఖాళీగానే ఉంటాడు. అందుకే వెంటనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు రెడీ అయ్యాడంటూ కొన్ని కాంబినేషన్‌లపై రూమర్లు మొదలయ్యాయి. తమిళ, తెలుగు డైరెక్టర్లు రామ్ చరణ్‌కు కథలు వినిపించారంటూ వార్తలు వచ్చాయి.

క్రేజీ కాంబోలు..
అయితే రామ్ చరణ్ కోసం ఇండియన్ డైరెక్టర్ శంకర్ కూడా కథ రెడీ చేశాడని ఆ రూమర్లలో ఒకటి. అంతే కాకుండా జెర్సీ సినిమాతో తన సత్తా చాటుకున్న గౌతమ్ తిన్ననూరి కూడా లైన్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే రెండు గంటల క్రితం రామ్ చరణ్ 15వ ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.

నేషనల్ వైడ్ ట్రెండ్..
అలా చెర్రీ 15వ ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోందని ప్రకటించిన క్షణం నుంచి ట్విట్టర్‌లో రచ్చ మొదలైంది. రామ్ చరణ్ పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా మార్మోగుతూనే ఉంది. అయితే కాసేపటి క్రితమే వదిలిన అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు.

ల్యాండ్ మార్క్ చిత్రం..
దిల్ రాజు నిర్మాతగా 50వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు భారీ ప్లాన్ వేశాడు. ఈక్రమంలో ఇలా రామ్ చరణ్ శంకర్‌లను ఒకే త్రాటిపైకి తెచ్చి అదిరిపోయే ప్లాన్ వేశాడు. ఇలా ఈ సినిమాతో దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో దిల్ రాజు జాతీయ స్థాయిలో సత్తా చాటేలా ఉన్నాడు.

రికార్డ్‌లు ఖల్లాస్..
ఈ సినిమా హిసార్టికల్ నేపథ్యంలో ఉండబోతోందని టాక్. ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నాడట. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. 2022లో ఈ మూవీ తెరపైకి రాబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











