Sankranti Releases ఒక్కసారి 5 సినిమాలు అంటే ఎలా? నేనేమైనా సీఎంనా? సంక్రాంతి రిలీజ్‌ల వివాదంపై దిల్ రాజు

సంక్రాంతి పండుగ రేసులో ఐదు భారీ సినిమాలు రిలీజ్ సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా, ఈగిల్ జనవరి 12 నుంచి జనవరి 14వ తేదీ వరకు తమ విడుదల డేట్లను ప్రకటించారు. అయితే ఐదుగురు పెద్ద హీరోల సీనిమాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. దాంతో ఓ రెండు సినిమాలను వాయిదే వేయించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి గురించి దిల్ రాజు మాట్లాడుతూ..

ఇండస్ట్రీ తరఫున కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వా త సినిమాటోగ్రపి మంత్రిని కలిశాం. సంక్రాంతి 2024 పండగకు ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ కోసం పోటి పడుతున్నాయి. ఐదుగురు నిర్మాతలను పిలిచి మాట్లాడినాం. రెండు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని ఒకరిద్దరు నిర్మాతలకు సూచించాం. చాలా మంది డిస్టిబ్యూటర్లతో కూడా వివరాలు ఇచ్చాం. ఒకట్రెండు రోజుల్లో ఎవరైనా తమ సినిమా రిలీజ్‌ వాయిదా వేసుకొంటే.. సోలో రిలీజ్ చేసే ఏర్పాట్లు, వెసులుబాటు ఫిలిం చాంబర్ తరఫున చేయిస్తాం అని చెప్పామని దిల్ రాజు అన్నారు.

 Dil Raju Reacted on Guntur Kaaram, Hanuman, Eagle, Saindhav Race for Sankrati 2024 Releases

సంక్రాంతికి మా సినిమాలు వస్తే గ్రాండ్ సక్సెస్ అవుతాయనే భ్రమల్లో ఉండకండి అని చెప్పాం. రెండు రోజుల్లో ఎవరైనా తమ రిలీజ్ వాయిదా వేసుకొంటారో వేచి చూస్తున్నాం. వారు పాజిటివ్ వస్తారని అనుకొంటున్నాం. ఈ పోటీలో ఉండకూడదని నా సినిమా గేమ్ ఛేంజర్‌ను వేసవికి వాయిదా వేశాం. ఇలాంటి పరిస్థితుల్లో రూమర్లు, గాసిప్స్ రాయకండి అని ఆయన సూచించారు.

సంక్రాంతికి గుంటూరు కారం సినిమా చూడాలని అందరూ అనుకొంటారు. ఆ సినిమాకే ఎక్కువ మంది టికెట్ బుక్ చేసుకొంటారు. డిమాండ్ ఉన్న సినిమాకు పోటీ లేకుండా చూస్తున్నాం. వారికి సలహాలు ఇస్తున్నాం. వారు మా సలహాలను పాటిస్తారా? లేదా అనేది వారికి ఇష్టం. ఐదు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావొద్దని, వాటిని ఆపేందుకు మేము చర్యలు తీసుకొంటున్నాం అని దిల్ రాజ్ చెప్పారు.

 Dil Raju Reacted on Guntur Kaaram, Hanuman, Eagle, Saindhav Race for Sankrati 2024 Releases

ఏపీ, తెలంగాణలో మూడు సెంటర్లు ఉంటే.. ఐదు సినిమాలు రిలీజ్ అయితే కొన్నింటికి ప్లేస్ లభించదు. వాటి వల్ల కొన్ని సినిమాలు నష్టపోతాయి. అందరూ లాభపడేలా చర్యలు తీసుకొంటున్నాం. సంక్రాంతి తర్వాత చాలా డేట్లు ఖాళీగా ఉన్నాయి అని దిల్ రాజ్ అన్నారు.

సంక్రాంతికి ప్రతీ ఏటా మూడు, నాలుగు సినిమాలు రావడం సహజం. కానీ ఐదు సినిమాలు రావడం వస్తున్నందున ఇబ్బంది ఏర్పడుతున్నది. ఆ సమస్యను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. డిసెంబర్‌లో యానిమల్, హాయ్ నాన్న, సలార్ సినిమాలు భారీ విజయాలు అందుకొన్నాయి. జనవరిలో కూడా ఇలాంటి హిట్స్ రావాలని కోరుకొంటున్నాం అని దిల్ రాజు చెప్పారు.

 Dil Raju Reacted on Guntur Kaaram, Hanuman, Eagle, Saindhav Race for Sankrati 2024 Releases

ఫిలిం చాంబర్ ప్రసిడెంట్ పదవిని చేపట్టి నాలుగు నెలలైంది. ఈ నాలుగు నెలల్లో చాలా హెల్తీగా మీటింగ్స్ జరిగాయి. చాలా విషయాలు చర్చించాం. కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాం. ఆ నిర్ణయాలు అమలు అయ్యాయా? లేదా అనేది కాదు. నేను జస్ట్ ఛాంబర్ ప్రసిడెంట్‌ను, నేను సీఎంను కాదు అని దిల్ రాజ్ ఓ ప్రశ్నకు స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X