దిల్ రాజు ‘కృష్ణాష్టమి’
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ తెరకెక్కించిన ఆయన తాజాగా ‘కృష్ణాష్టమి' అనే టైటిల్ తన బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రిజిస్టర్ చేయించారు. దీంతో ఆయన నుండి మరో మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ వస్తుందని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం దిల్ రాజు ‘కేరింత' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎమ్ ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఈ చిత్రం చేస్తున్నారు. ‘వినాయకుడు' ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం లా చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్తున్నారు.
'వినాయకుడు' తో తానేంటో నిరూపించున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











