దిల్ రాజు పక్కా ప్లానింగ్.. మూడు నెలల్లో మూడు సినిమాలు!
నిర్మాత దిల్ రాజు తాజాగా మహేష్ బాబు తో వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెలనుండి సెట్స్ మీదకు వెళుతోంది. దేవి సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో మఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
నిర్మాత దిల్ రాజు వచ్చే నెల నుండి వరుసగా మూడు నెలల్లో మూడు సినిమాలను విడుదల చెయ్యబోతున్నాడు. మొదటగా రాజ్ తరుణ్ నటించిన లవర్. అనిష్ కృష్ణ దర్శకత్వం వహించిన లవర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా ను జూలై లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.

హీరో రాజ్ తరుణ్ సినిమా తరువాత శతమానం భవతి మూవీ ద్వారా హిట్ అందుకున్న డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీకి దర్శకుడు. శ్రీనివాస కళ్యాణం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగుస్ట్ లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు సమాచారం.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. జూలై, ఆగుస్ట్, సెప్టెంబర్ మూడు నెలల్లో మూడు సినిమాలు విడుదల చెయ్యబోతున్నాడు దిల్ రాజు.


Click it and Unblock the Notifications











