విడుదలకు ముందే స్టోరీ లీక్ చేసిన దిల్ రాజు
హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రం ‘ఓకే కణ్మణి' చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం' పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఈ సినిమా విడుదలకు ముందే స్టోరీ లీక్ చేసారు. ఆ స్టోరీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
హీరో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ముంబైలో కలుసుకుంటారు. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. విదేశాలకు వెళ్లే ముందు ఇద్దరూ సహజీవనం చేయాలనుకుంటారు. సినిమా మొత్తం ముంబై బ్యాక్ గ్రౌండుతో నడుస్తుంది. వీరు సహజీవనం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ప్రేమలో పడ్డారా? లేదా ముందుగా అనుకున్న ప్రకారం విదేవాలక వెళ్లారా? అనేది స్టోరీ లైన్.

‘ఓకే బంగారం' అనేది క్యూట్ లవ్ స్టోరీ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ నెలలోనే సినిమా ఆడియో విడుదల చేసి ఏప్రిల్ నెలలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని మార్చి 27న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఇప్పటికే మెంటర్ మదిలో సాంగ్..అబిమానులను ఊపేస్తోంది.ఈ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్‌కు నాని డబ్బింగ్ చెబుతున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘గతంలో సఖి సినిమాను నైజాంలో విడుదల చేశాను. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ఓకే బంగారం' సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతున్నాను. మణిరత్నంగారి దర్శకత్వం, పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫీ, రెహమాన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'' అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.


Click it and Unblock the Notifications











