దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు: పవన్, మహేశ్ వల్ల 25 కోట్లు నష్టం.. ఆయన కెరీర్‌లో ఎక్కువ లాభం ఆ సినిమాకేనట
తెలుగు సినీ ఇండస్ట్రీలో డిస్టిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించి.. చాలా తక్కువ సమయంలోనే బడా నిర్మాతగా ఎదిగిపోయారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.దాదాపు ఇరవై ఏళ్లుగా వందకు పైగా సినిమాలను నిర్మించిన ఆయన.. ఎన్నో చిత్రాలను పంపిణీ కూడా చేశారు. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.
ఈ ఉత్సాహంతోనే కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు మూవీల లెక్కలు చెప్పి షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సినిమా పేరు ఇంటి పేరుగా: డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతోన్న సమయంలోనే నితిన్ నటించిన 'దిల్' అనే సినిమాతో రాజు నిర్మాతగా మారారు. మొదటిదే హిట్ అవడంతో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో సినిమాలు నిర్మించారు. అదే సమయంలో ఎన్నో చిత్రాలను పంపిణీ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్నారు.
రెండు భారీగా.. అవి కూడా: దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీని నిర్మిస్తున్నారు. దీనికోసం ఆయన దాదాపు వంద కోట్లకు పైగానే బడ్జెట్‌ను పెడుతున్నారు. అలాగే, కల్యాణ్ రామ్‌తోనూ ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాలను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇలా ఇటీవలే 'బలగం'తో హిట్ కొట్టారు.

శాకుంతలం కోసం బిజీగా: వరుసగా సినిమాల మీద సినిమాలు నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ దూసుకుపోతోన్న దిల్ రాజు.. ఇప్పుడు సమంత - గుణశేఖర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'శాకుంతలం' మూవీకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఇంటర్వ్యూలో షాకింగ్‌గా: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ఆ సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు తన వ్యక్తిగత విశేషాలు, గత చిత్రాల అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలను కూడా ఆయన వెల్లడించారు.

అది సాధ్యం కాదంటూ: తాజాగా బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన తన జర్నీ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగానే 'ఒకవేళ నేను నిర్మాతను కాకపోయి ఉంటే.. డిస్ట్రిబ్యూటర్‌గా ఇంత లాంగ్ జర్నీ ఉండేది కాదు' అని ఆయన వెల్లడించారు. నిర్మాతగా కొనసాగడం వల్లే సినిమాను పంపిణీ చేయగలుగుతున్నా అని చెప్పారు.
స్పైడర్‌కు 12 కోట్లు లాస్: అదే ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ 'స్పైడర్' సినిమా వల్ల తనకు ఎదురైన నష్టాల గురించి తొలిసారి బయట పెట్టారు. '2017లో నిర్మాతగా నావి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అదే సంవత్సరం మహేశ్ - మురుగదాస్ గారి 'స్పైడర్'ను కొన్నాను. ఈ సినిమా వల్ల నాకు ఏకంగా రూ. 12 కోట్లు లాస్ వచ్చింది' అంటూ ఆయన షాకింగ్ లెక్కలను రివీల్ చేశారు.

పవన్ మూవీకి 13 కోట్లు: ఆ తర్వాత దిల్ రాజు కంటిన్యూ చేస్తూ.. 'అదే సంవత్సరం పవన్ కల్యాణ్ గారు హీరోగా చేసిన 'అజ్ఞాతవాసి' రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు కొన్నాను. కానీ, ఈ మూవీ వల్ల రూ. 13 కోట్లు నష్టం వచ్చింది. అంటే ఒకే సంవత్సరం రెండు సినిమాలకే రూ. 25 కోట్లు పోగొట్టుకున్నా. ఒకవేళ నేను నిర్మాతగా హిట్లు కొట్టకపోయి ఉంటే ఇవి కవర్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు' అని అన్నారు.
ఎక్కువ లాభం దానికే: ఈ ఇంటర్వ్యూ చివర్లో దిల్ రాజు మాట్లాడుతూ.. 'నేను డిస్ట్రిబ్యూటర్‌గా పోగొట్టుకున్న డబ్బును నిర్మాతగా హిట్లు కొట్టడం వల్ల సరి చేయగలుగుతున్నా. నేను పంపిణీ చేసిన చిత్రాల్లో 'బాహుబలి'కి వచ్చిన రూ. 10 కోట్ల లాభమే హయ్యెస్ట్. ఇంత పెద్ద మొత్తం మరే సినిమాకు కూడా రాలేదు. డిస్ట్రిబ్యూషన్ అంటే అలాగే ఉంటుంది' అంటూ ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications











