ఒక్క పాటతో దిల్ రాజు రెండు లక్షల టిక్కెట్లు
దిల్ రాజు మొదటి నుంచి తనదైన బిజెనెస్ వ్యూహాలతో మార్కెట్ లో రాజుగా వెలుగుతున్న సంగతి తెలిసిందే.ఎప్పటికప్పుడు ప్రేక్షకుల పల్స్ పట్టుకుని హిట్స్ కొట్టడమే కాకుండా తన దైన శైలిలో మార్కెటింగ్ చేస్తూ బిజెనెస్ విషయాల్లోనూ దిల్ ఉన్నవాడుగా నిరూపించుకుంటున్నాడు.తాజాగా ఆయన నిర్మిస్తున్న ఓహ్ మై ప్రెండ్ చిత్రంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజి అంటూ ఓ పాటను పెట్టారు.ఆ పాటలో ప్రస్దావించిన శ్రీ చైతన్య కాలేజీలు గ్రూప్ లో ఆంధ్రాలో నెంబర్ వన్ స్టేజిలో ఉన్నాయి.వాళ్ల స్టూడెంట్స్ రెండు లక్షలకు పైగానే ఉన్నారు.వారందరినీ ఈ ఒక్క పాటతో టార్గెట్ చేసినట్లు అయ్యింది అంటున్నారు.అంతేగాక ఈ చిత్రం డిస్క్ పంక్షన్ ని కుకుట్ పల్లిలోని ఆ కాలేజి క్యాంపస్ లో ఐదు వేల మంది స్టూడెంట్స్ మధ్యన జరిపి మరో సారి స్టూడెంట్స్ తో ఆసక్తిని రేపారు.ఈ ఒక్క కాలేజీ పిల్లలు మాత్రమే కాక మిగతా జూనియర్,డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ దృష్టి కూడా ఈ స్టాటజీతో ఒక్కసారి ఇటు వైపు తిరిగి తన చిత్రానికి ఓ రేంజి ఓపినింగ్స్ వస్తాయని దిల్ రాజు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ చిత్రం ప్రేమకి,స్నేహానికి మధ్య ఉన్న చిన్న గీత చుట్టూ తిరుగుతుంది.సిద్దార్ద,నవదీప్,శృతిహాసన్,హన్సిక ఈ చిత్రంలో నటించారు.వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











