For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Mr పెర్ఫెక్ట్’ కాపీ అని తేల్చిన కోర్టు: చిక్కుల్లో దిల్ రాజు, దశరథ్

  |
  Prabhas Film Mr Perfect In Trouble || Filmibeat Telugu

  ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'Mr పర్ఫెక్ట్' 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ కథ 2010లో విడుదలైన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవల నుంచి కాపీ కొట్టిందనే ఆరోపణలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది.

  దీనిపై రచయిత ముమ్ముడి శ్యామల దేవి చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు ముమ్మడి శ్యామలా దేవి రాసిన 'నా మనసు కోరింది నిన్నే' నవల నుంచి తీసుకున్నదే అని సిటీ సివిల్ కోర్టు నిర్దారించింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలకు పోలీసు శాఖను ఆదేశించింది.

  కాపీ కొట్టినట్లు అప్పటి వరకు నాకు తెలియదు

  కాపీ కొట్టినట్లు అప్పటి వరకు నాకు తెలియదు

  2011లో సినిమా విడుదల సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. 2013లో టీవీలో ‘Mr పర్ఫెక్ట్' సినిమా వస్తుంటే చూశాను. చూశాక వంద శాతం నా నవలను కాపీ చేసి తీశారని అర్థమైంది. అవే డైలాగులు, సీన్లు... కొన్ని చోట్ల మార్చడానికి ట్రైచేశారు కానీ ప్రతీ సీను నా నవల నుంచి తీసుకున్నదే అని శ్యామలదేవి తెలిపారు.

  దిల్ రాజు అపాంట్మెంట్ ఇవ్వలేదు, అవి తప్పుడు ఆధారాలే

  దిల్ రాజు అపాంట్మెంట్ ఇవ్వలేదు, అవి తప్పుడు ఆధారాలే

  విషయం తెలుసుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజును సంప్రదించేందుకు ఆమె ప్రయత్నించాను. అయితే ఆయన అపాంట్మెంట్ ఇవ్వలేదు. కథా రచయితల సంఘంలో దశరథ్ 2009లోనే రిజిస్టర్ చేశారని చూపించే ప్రయత్నం చేశారు, కానీ అవన్నీ తప్పుడు ఆధారాలే అని రచయిత శ్యామలదేవి అన్నారు.

  సాక్ష్యాలు చూపించిన నన్నే ఇంతగా ఏడిపించారు

  సాక్ష్యాలు చూపించిన నన్నే ఇంతగా ఏడిపించారు

  అన్ని సాక్ష్యాలు చూపించిన నన్నే ఇంతగా ఏడిపించారు. రైటర్స్ అసోసియేషన్లో కూడా చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ స్క్రిప్టు తీసుకున్న వెంటనే సంతకం పెట్టించుకుని దాన్ని మనకే ఇచ్చేస్తారు. వారి వద్ద మరో కాపీ ఉండదు. అదే గవర్నమెంట్ కాపీరైట్ అయితే లాకర్లో ఉంటుంది కాబట్టి ఆధారం ఉంటుంది. ఇంత గొడవ అయి రెండేళ్లు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి చార్జ్ షీట్ కోసం అడిగితే.. తూతూ మంత్రంగా వైట్ పేపర్ మీద జిరాక్స్ దశరథ్ సబ్‌మిట్ చేశారు. పేపర్లో కూడా అడ్వర్టైజ్ చేసుకున్నారని ముమ్మడి శ్యామలా దేవి తెలిపారు.

  సంవత్సరం కష్టపడ్డాను, న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది

  సంవత్సరం కష్టపడ్డాను, న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది

  ప్రతి నవల 3 నెలల్లో పూర్త చేస్తాను,ఇది సంవత్సరం పట్టింది. క్యారెక్టర్స్ అంత గొప్పగా తీర్చి దిద్దాను కాబట్టే ఎక్కువ సమయం తీసుకుంది. 30 సీన్ల వరకు ఉన్నది ఉన్నట్లు దించేశారు. ఏ రచయిత అయినా కోరుకునేది గుర్తింపే. అందుకే నేను న్యాయ పోరాటం చేశాను. ఆల్రెడీ చాలా భాషల్లో నా కథను సొమ్ము చేసుకున్నారు. ఒక మీద ఏమైనా తీస్తే నాకు క్రెడిట్ ఇవ్వాలని జడ్జిగారు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని శ్యామల దేవి మీడియాతో పంచుకున్నారు.

  ప్రభాస్ నన్నే మెచ్చుకున్నట్లు అనిపించింది

  ప్రభాస్ నన్నే మెచ్చుకున్నట్లు అనిపించింది

  గతంలో ఓ సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ... దశరథ్ డైరెక్టర్‌గా కంటే రచయితగా నచ్చారు అన్నారు. ప్రభాస్ ఆయన్ను మెచ్చుకుంటుంటే నన్నే మెచ్చుకున్నట్లు ఫీలయ్యాను. ఈ కేసు గెలిస్తే ఒక్కసారి ప్రభాస్ గారిని కలవాలని ఉందని తెలిపారు.

  కథ కాపీ కొట్టి నా కెరీర్ దెబ్బతీశారు, నష్టపరిహారం అడుగుతా

  కథ కాపీ కొట్టి నా కెరీర్ దెబ్బతీశారు, నష్టపరిహారం అడుగుతా

  నా కథ కాపీ కొట్టి నా కెరీర్ దెబ్బతీశారు. ఈ పోరాటం మొదలు పెట్టిన తర్వాత కథలు రాయడం తగ్గించేశాను. నన్ను ఇంత బాధ పెట్టినందుకు కచ్చితంగా నష్టపరిహారం అడుగుతాను. నష్టపరిహారం అడిగేది కోట్లు కొట్టడానికి కాదు, వారికి పనిష్మెంట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యమని శ్యామలదేవి తెలిపారు.

  English summary
  The Hyderabad City Civil Court revealed their decision now that Mr Perfect is a complete copy of Syamala Devi's novel ‘Naa Manasu Korindi Ninne’. The court asked the Hyderabad police to take necessary action on Dil Raju and his team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X