దిల్ రాజు నెక్ట్స్ సినిమా టైటిల్ ఏంటంటే...
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తదుపరి చిత్రానికి అంతా మీరే చేసారు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.టైటిల్ కి తగినట్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక టైటిల్ హిట్ చిత్రం బొమ్మరిల్లు లోని సిద్దార్ధ క్లైమాక్స్ లో సిద్దార్ధ చెప్తాడు. ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజస్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు..సిద్దార్ధ హీరోగా ఓ మై ప్రెండ్ రెడీ చేస్తున్నారు. కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్దార్ధ హీరోగా ఈ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు.
ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు.అలాగే నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. దర్శకుడు తన నిజ జీవితంలో స్కూల్ మేట్ తో అనుభవాల ఆధారంగా ఈ కథని తయారు చేసుకున్నట్లు చెప్తున్నాడు.ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు..ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు.అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు గా శృతిహాసన్ ,హన్సిక నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











