twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీనివాస కళ్యాణం రిజల్ట్.... అయోమయంలో దిల్ రాజు, చివరకు ఏం చేశాడంటే!

    By Bojja Kumar
    |

    పక్కా హిట్ అనే నమ్మకంతో తీసిన సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు రాకుంటే.... అందులో దిల్ రాజు లాంటి తలపండిన బాక్సాఫీసు స్ట్రాటజిస్ట్ అంచనాలు తారుమారైతే అయోమయం తప్పదు. ప్రస్తుతం తాను అలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నట్లు ఉన్నాను అంటున్నారు దిల్ రాజు. కొన్ని సినిమాలు పోతాయని ముందే ఊహిస్తాం, కొన్ని సినిమాలపై విడుదల ముందు అయితే హిట్ అవ్వొచ్చు, లేకుంటే లేదు అనే అనుమానాలు ఉంటాయి. కానీ పక్కా హిట్ అనుకున్న మూవీ నా కెరీర్లో ఎప్పుడూ అంచనాలు తప్పలేదు, 'శ్రీనివాస కళ్యాణం' సినిమాకు వస్తున్న రెప్పాన్స్ చూసి తాను సైతం అయోమయంలో పడ్డట్లు దిల్ రాజు తెలిపారు.

     పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.... అంతలోనే!

    పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.... అంతలోనే!

    ‘శ్రీనివాస కళ్యాణం'పై మాకు ముందు నుండీ మంచి అంచనాలున్నాయి. ప్రివ్యూ షో వేసినపుడు కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. అమెరికా నుంచి వచ్చిన తొలి రివ్యూ కూడా పాజిటివ్‌గానే ఉంది. సినిమా అందరికీ నచ్చింది అని సంతోషించేలోపే రిలీజ్ రోజు మధ్యాహ్నం నుంచి మిక్డ్స్ టాక్‌ మొదలైంది... అని దిల్ రాజు తెలిపారు.

    వారి వల్లే ఇలాంటి ప్రచారం

    వారి వల్లే ఇలాంటి ప్రచారం

    యూత్‌కు కొంత మందికి సినిమా నచ్చలేదు, అదే విధంగా కొందరు విమర్శకులు కూడా నెగెటివ్ రివ్యూలు రాశారు. ఇవి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగాయి. కానీ శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసి సినిమా బావుందని చెప్పారని దిల్ రాజు తెలిపారు.

    చివరకు దిల్ రాజు ఏం చేశారంటే..

    చివరకు దిల్ రాజు ఏం చేశారంటే..

    సినిమా ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనే విషయంలో కన్‌ఫ్యూజన్‌లో పడ్డ దిల్ రాజు..... నేరుగా థియేటర్లో ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఓ ప్లాన్ చేశారు. కొన్ని కార్డ్స్ ప్రింట్ చేయించి సినిమా ఎలా ఉందనే అభిప్రాయాలు సేకరించారట. అందులో... బాగుంది, చాలా బాగుంది, బాలేదు అనే ఆప్షన్స్ పెట్టి అభిప్రాయాలు సేకరించారట.

    బావుందనే రెస్పాన్స్ వచ్చింది

    బావుందనే రెస్పాన్స్ వచ్చింది

    దాదాపు 60 నుండి 70 థియేటర్లలో ఈ కార్డ్స్ పంపిణీ చేశాం. ఆరు షోలలో వారి స్పందన సేకరించాం. సోషల్ మీడియాలో మా సినిమాపై జరుగుతున్న ప్రచారంతో పోల్చుకుంటే థియేటర్లలో ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ బావుందని దిల్ రాజు తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ పాజిటివ్ మౌత్ టాక్ ద్వారా మా సినిమాకు మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

    English summary
    Tollywood producer Dil Raju's special survey on Srinivasa Kalyanam result. Dil Raju said, Disappointed So Much After Hearing Srinivasa Kalyanam Movie firstday negetive talk. But now happy because of family auduance liked the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X