నాగ్ చిత్రానికి టైటిల్ పెట్టండి-బహుమతి కొట్టండి...!?
యువసామ్రాట్ అక్కినేని నాగార్జునతో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ పెట్టి బహుమతి గెలుచుకోండని నిర్మాత ప్రకటించారు. 'ఆకాశమంత" చిత్ర దర్శకుడు రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఈ చిత్రానికి 'పయనం", 'గగనం",'వాంటెడ్" అని మూడు టైటిల్స్ పరిశీలనకు పెట్టాం.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రేక్షాభిమానులు వీటిలో దేన్ని సరైన టైటిల్ గా ఎంపిక చేస్తే డ్రా తీసి అందులో గెలుపొందిన వరుస ఏడుగురికి బహుమతులు అందజేస్తామని దిల్ రాజు చెప్పారు.ఇంకేముంది తమ అభిమాన నటుడి కోరికమేరకు మంచి టైటిల్ కోసం 'వేటమొదలు"పెట్టారు నాగ్ అభిమానులు. అన్నట్లు ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం నాగార్జుకు చాలా ప్రీతి పాత్రమైనదనీ, తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని దిల్ రాజు అన్నారు. టైటిల్ ఈ అడ్రెస్‌కు మెయిల్ చేయాలన్నారు...నాగ్ ఫిలింటైటిల్ ఎట్ జీమెయిల్.కామ్([email protected]).


Click it and Unblock the Notifications











