»   » మెగా హీరోతో మరో కొత్త ప్రాజెక్టు ప్రకటించిన దిల్ రాజు, డీటేల్స్...

మెగా హీరోతో మరో కొత్త ప్రాజెక్టు ప్రకటించిన దిల్ రాజు, డీటేల్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘పిల్లానువ్వు లేని జీవితం' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది ‘పటాస్' వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా...దిల్ రాజు మాట్లాడుతూ ‘గతంలో కందిరీగ, దరువు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందించిన ‘పటాస్' చిత్రంతో బాక్సాఫీస్ కి ఈ ఏడాది తొలి హిట్ మూవీనందించి దర్శకుడిగా మారాడు. మంచి కథ, డైలాగ్స్, డైరెక్షన్ పరంగా గ్రిప్పింగ్ గా పటాస్ సినిమాని రూపొందించిన అనిల్ రావిపూడి నెక్స్ ట్ మూవీని మా బ్యానర్ లో రూపొందించడం ఆనందంగా ఉంది. ‘పిల్లానువ్వు లేని జీవితం' మూవీతో సక్సెస్ సాధించిన సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం' సినిమా విడుదలకు ముందే ఆ సినిమాపై నమ్మకంతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని మా బ్యానర్ లో రూపొందించడానికి రెడీ అయ్యాం. ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్ కాకముందే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాం. అనిల్ రావిపూడి ‘పటాస్' చిత్రం కంటే ఈ సినిమాలో కామెడి రేంజ్ ఎక్కువగా ఉండేలా కథను సిద్ధం చేశాడు. అలాగే ‘పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో తన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సాయిధరమ్ తేజ్ ఎనర్జీకి సరిపోతూ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకనే మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. సెప్టెంబర్ నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాం. త్వరలో ఈ కథ కి సరిపడ పవర్ ఫుల్ టైటిల్ ని అనౌన్సు చేస్తాం అని అన్నారు .

Dil Raju, Sai Dharam Tej next movie details

రాశిఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సాయికుమార్, పోసాని కృష్ణమురళి వంటి భారీ తారాగణంతో సినిమాని కలర్ ఫుల్ మూవీగా నిర్మించనున్నాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని నెక్స్ ట్ సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. యిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, పోసాని, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, రచనా సహకారం: ఎస్.కృష్ణ, ఫైట్స్: వెంకట్, సహ నిర్మాతలు: శిరీష్ , లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.

English summary
Sai will be working under the direction of Patas fame Anil Ravipudi. Dil Raju confirmed this project a short while ago and said that he has a lot of confidence on Anil’s script and is mighty impressed with Dharam Tej as the lead hero for this film.
Please Wait while comments are loading...