»   » అంతా పోగొట్టుకుని అప్పుల పాలైన దిల్ రాజు... మళ్లీ ఇండస్ట్రీలోకి ఎలా!

అంతా పోగొట్టుకుని అప్పుల పాలైన దిల్ రాజు... మళ్లీ ఇండస్ట్రీలోకి ఎలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజ్.... తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. పరిశ్రమలోకి ఎంతో మంది నిర్మాతలు వస్తుంటారు, నష్టాలతో చేతులు కాల్చుకుని పోతుంటారు. కానీ సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ స్టాండ్ అయిన అతికొద్ది మంది ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజుది నెం.1 స్థానం.

అయితే మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు.... తొలి అడుగులోనే భారీ నష్టాలు ఎదుర్కోవడమే కాదు, అప్పల పాలయ్యాడు. దీంతో పరిశ్రమను వదిలేసి మళ్లీ తన ఫ్యామిలీ రన్ చేస్తున్న ఆటోమొబైల్ బిజినెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట.


అయితే ఓ సంఘటన దిల్ రాజును మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసింది. ఇరవయ్యేళ్ల క్రితం జీరోతో మొదలైన దిల్ రాజు ఇపుడు ఈ స్థాయికి ఎలా వచ్చారు? పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ఆసక్తికర విషయాలు ప్రేమ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


26 ఏళ్ల వయసులో ఎంట్రీ...

26 ఏళ్ల వయసులో ఎంట్రీ...

సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని... ఆటోమొబైల్ బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన దిల్ రాజు సినిమా రంగంలోకి సినిమా పిచ్చితో కాకుండా బిజినెస్ ఆలోచనతోనే వచ్చారట. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు.


తొలి అడుగులోనే భారీ నష్టాలు

తొలి అడుగులోనే భారీ నష్టాలు

1996లో హర్షిత ఫిల్మ్స్ అని ఓ బిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించిన దిల్ రాజు సంవత్సరంలో మూడు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాల కోసం 40 లక్షలు సొంతగా పెట్టుబడి పెట్టగా, మరో 40 లక్షలు అప్పు చేశారు. అయితే మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ కావడంతో 80 లక్షలు నష్టపోయారు. దీంతో సినిమా వ్యాపారాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారట.


దిల్ రాజు నిజాయితీ...ఆయన్ను మళ్లీ రప్పించింది

దిల్ రాజు నిజాయితీ...ఆయన్ను మళ్లీ రప్పించింది

సినిమా పరిశ్రమ నుండి వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్న దిల్ రాజును.... ఆయనలోని నిజాయితీ మళ్లీ పరిశ్రమలోకి వచ్చేలా చేసింది. అప్పట్లో కాస్టూమ్ కృష్ణ తీసిన అరుంధతి(సౌందర్య మూవీ) సినిమాను దిల్ రాజు 36 లక్షలకు కొన్నారు. డబ్బులు తక్కువగా ఉండటంతో రిలీజ్ రోజు 34 లక్షలు మాత్రమే కట్టారు. సినిమా డిజాస్టర్ కావడంతో మొత్తం డబ్బు పోయింది. అయితే దిల్ రాజు నష్టపోయినప్పటికీ తాను ఇచ్చిన కమిట్మెంటుకు లోబడి నిజాయితీగా మిగిలిన 2 లక్షలు కూడా కట్టడంతో... కాసుల కృష్ణ ఆశ్చర్యపోయారట. సాధారణంగా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగవు.


ఆ సినిమాతో దిల్ రాజు మళ్లీ ఇండస్ట్రీలోకి

ఆ సినిమాతో దిల్ రాజు మళ్లీ ఇండస్ట్రీలోకి

తర్వాత కాస్టూమ్ కృష్ణ కన్నడలో రూపొందిన ‘అనురాగ సంగమ' అనే చిత్రాన్ని తెలుగులో ‘పెళ్లి పందిరి' పేరుతో జగపతి బాబు హీరోగా మొదలు పెట్టారట. ఆ సినిమా ఓపెనింగుకు దిల్ రాజును చెన్నైకి ఆహ్వానించారట. అపుడు సీవి రెడ్డి ఆఫీసులో ‘అనురాగ సంగమ' సినిమా సీడీ చూసిన దిల్ రాజుకు బాగా నచ్చేసిందట. ఎలాగైనా ఆ సినిమాకు నిర్మాతగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. దిల్ రాజులోని నిజాయితీ నచ్చిన కాస్టూమ్ కృష్ణ ఆ సినిమా రైట్స్ దిల్ రాజుకే దక్కేలా చేశారు. ఆ సినిమాను ఎంఎస్ రెడ్డితో కలిసి నిర్మించిన దిల్ రాజు తొలి విజయం అందుకున్నారు. 1997 డిసెంబర్లో ఆ సినిమా మొదలైంది.


25 సినిమాలు... 18 సక్సెస్‌లు

25 సినిమాలు... 18 సక్సెస్‌లు

గడిచిన 20 ఏళ్లలో దిల్ రాజు 24 సినిమాలు నిర్మించారు. డిజె చిత్రం ఆయన నిర్మించిన 25వ మూవీ. ఈ సినిమాల్లో 18 సక్సెస్‌లు అందుకున్నారు. డిజె మూవీ కూడా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నారు దిల్ రాజు.


చెడిపోతాననే భయం కూడా

చెడిపోతాననే భయం కూడా

నిజామాబాద్ జిల్లాలో ఓ చిన్న పల్లెటూరి నుండి ప్రారంభమైన తన జీవితం ఈ స్థాయికి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని.... అలాంటి థాట్ కూడా ఎప్పుడూ రాలేదు. రామానాయుడు లాంటి గొప్ప ప్రొడ్యూసర్లతో తనను పోల్చడం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుందని... అది విన్నపుడల్లా తనలో ఓ వైబ్రేషన్ ఉంటుందని... అదే సమయంలో అది తీసుకుంటే ఎక్కడ తాను చెడిపోతాననే భయం కూడా ఉంటుంది... అందుకే దాన్ని నేను తీసుకోను, కోట్లలో ఒకరికి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది, ఇదంతా గాడ్ గిఫ్ట్ అని తాను భావిస్తానని దిల్ రాజు తెలిపారు.


వివి వినాయక్ వల్ల తొలి సినిమాలోనే చాలా నేర్చుకున్నాను

వివి వినాయక్ వల్ల తొలి సినిమాలోనే చాలా నేర్చుకున్నాను

పూర్తి స్థాయి నిర్మాతగా మారిన తర్వాత తొలి సినిమాలోనే చాలా నేర్చుకున్నాను. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు వివి వినాయక్‌కే దక్కుతుంది. ‘దిల్' మూవీ ఆయనకు మూడో సినిమా, నాకు ఫస్ట్ ఫిల్మ్. అపుడు నన్ను వినాయక్ ఒక బ్రదర్ లా చూసేవాడు. స్క్రిప్టు దగ్గర నుండి ప్రతి విషయంలో నన్వు ఇన్వాల్వ్ చేశాడు. అపుడే చాలా నేర్చుకున్నాను అని దిల్ రాజు తెలిపారు.


అలాంటి డబ్బే కావాలి

అలాంటి డబ్బే కావాలి

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు రావడం, పోవడం కామన్ థింగ్. ఇక్కడ నేను నిలబడటమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలే వెళతాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజీని చూసుకుంటూ దాని వెనకాల వెళ్లకుండా సక్సెస్ తో పాటు వచ్చే డబ్బు కావాలి. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బును ఎంజాయ్ చేయను అని దిల్ రాజు తెలిపారు.


నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే

నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే

సినిమా ఇండస్ట్రీలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని.... వీటి వల్ల చివరకు నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే అని దిల్ రాజు తెలిపారు. నష్టం వచ్చినపుడు ఎవరూ పట్టించుకోరు. సక్సెస్ ఉన్నపుడు మాత్రం డిస్ట్రిబ్యూటర్ గురించి కొందరు నిర్మాతలు రకరకాలుగా మాట్లడతారు. మాకు దొంగలెక్కలు చూపిస్తారనే పీలింగులో ఉంటారని దిల్ రాజు తెలిపారు.


ఇండస్ట్రీలో నటించే వాళ్లే ఎక్కువ

ఇండస్ట్రీలో నటించే వాళ్లే ఎక్కువ

సినిమా ఇండస్ట్రీలో నిజాయితీగా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది అని.... ఎక్కువ మంది నటిస్తుంటారని, పరిశ్రమలో మంచి వ్యక్తులు చాలా తక్కువ మందే అని దిల్ రాజు తెలిపారు. సినిమా అనేది వ్యపారం కాబట్టి కొన్నిసార్లు అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమలో ఏ రిలేషన్ శాశ్వతం కాదని, సక్సెస్ ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడ రిలేసన్స్ ఉంటాయన్నారు.


English summary
A couple of days ago, Dil Raju’s film Shatamanam Bhavati won the National Award for the Best Popular Film. After receiving this award, Dil Raju spoke to the media and said how much he missed his wife and how miserable it was for him. He said that this award from the government was like a god given gift.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu