'సీతమ్మ వాకిట్లో...' లో బ్రహ్మీ సీన్స్ కలపటంపై దిల్ రాజు
హైదరాబాద్ : వెంకటేష్, మహేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం శుక్రవారం విడుదలై మొదట డివైట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఎడిటింగ్ లో తొలిగించిన బ్రహ్మానందం సన్నివేశాలు మళ్ళీ కలపనున్నట్లు వార్తలు మీడియాలో వచ్చాయి. సినిమాలో కామెడీ పరంగా తగ్గిందని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వినిపిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని దిల్ రాజు ఖండించారు. తమ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్నప్పుడు సీన్స్ కలపాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ...నాకు ఈ చిత్రంలో బ్రహ్మానందం సీన్స్ కలపాల్సిన అవసరం కనిపించటం లేదు. భాక్సాఫీస్ వద్ద చిత్రం దూసుకుపోతున్న సమయంలో అటువంటి నిర్ణయం ఆలోచనలు ఎందుకు చేస్తాం అన్నారు. సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక్కడే కాక ఓవర్ సీస్ లోనూ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. తమిళంలోనూ పండగ సీజన్ లో నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు. అంతేగాక యాభై రోజుల తర్వాత కూడా అటువంటి సీన్స్ కలపాల్సిన పనిలేదని అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ..'అలా సీన్స్ కలపటం అనేది అనుకున్నంత ఈజీ కాదు. వాటి కోసం ప్రత్యేకంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి. రీ రికార్డింగ్ చేయించాలి. సీన్ ప్లేస్ మెంట్స్ కరెక్టుగా అంచనా వెయ్యాలి. వీటికి తోడు ఈ పనంతా అయ్యాక మళ్లీ సెన్సార్ చేయించి అప్పుడు జనాలు ముందుకు తీసుకురావాలి..అది చాలా చాలా కష్టమైన పెద్ద ప్రాసెస్ ' అని అన్నారు.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు వస్తున్న స్పందన అమోఘం. సినిమా చూసి జర్నలిస్టులు ఫోన్‌లు చేస్తుంటే కన్నీటిపొర ఆగలేదు. ఏడాది పాటు నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను'' అని దిల్‌రాజు అన్నారు. నా ప్రతి సినిమా విడుదలైనప్పుడు క్రాస్ రోడ్‌కెళ్ళి సెకండ్ షో చూసిన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వినడం అలవాటు. సీతమ్మ వాకిట్లో.. చూసిన వారు దగ్గరికొచ్చి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదంతా చూస్తుంటే పండుగ ముందే వచ్చిందా అనిపించింది అన్నారు.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు వస్తున్న స్పందన అమోఘం. సినిమా చూసి జర్నలిస్టులు ఫోన్‌లు చేస్తుంటే కన్నీటిపొర ఆగలేదు. ఏడాది పాటు నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను'' అని దిల్‌రాజు అన్నారు. నా ప్రతి సినిమా విడుదలైనప్పుడు క్రాస్ రోడ్‌కెళ్ళి సెకండ్ షో చూసిన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వినడం అలవాటు. సీతమ్మ వాకిట్లో.. చూసిన వారు దగ్గరికొచ్చి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదంతా చూస్తుంటే పండుగ ముందే వచ్చిందా అనిపించింది. కొన్నిచోట్ల నుంచి మహిళలు భారీ సంఖ్యలో టిక్కెట్లు కావాలని ఫోన్లు చేస్తున్నారు


Click it and Unblock the Notifications











