ఆస్కార్‌కు బలగం మూవీ.. బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నాం.. దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన బలగం చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన ఈ చిత్రం తెలంగాణలోని ప్రతీ పల్లెను కదిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను కురిపించింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకొంచుకొంటూ మీడియాతో దిల్ రాజు మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే?

నిర్మాతగా 20 ఏళ్ల ప్రయాణం
బలగం సినిమా మంచి సినిమా అవుతుందని నిర్మించాం. కానీ గొప్ప సినిమా అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయి.. అందరి ప్రశంసలు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇలాంటి అనుభూతి కలిగింది. ఏప్రిల్ 5వ తేదీకి దిల్ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అవుతుంది. నా 20 ఏళ్ల ప్రయాణంలో 50 సినిమాలు చేశాను. 20 ఏళ్ల ప్రయాణంలో బొమ్మరిల్లు సినిమా చేసినప్పుడు ఫ్యామిలీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ ఆరోపణలు నిజం కాదు..
తెలంగాణలో ప్రతీ పల్లెలో పరదాలు కట్టి ప్రొజెక్టర్ల ద్వారా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాలనే లక్ష్యంతోనే నిర్మించాం. ఆ టార్గెట్ పూర్తవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము సినిమా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని వస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజం కాదు అని దిల్ రాజు అన్నారు.

బలగం మూవీకి ఇంటర్నేషనల్ అవార్డులు
బలగం సినిమాకు ప్రశంసలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట వచ్చింది. బలగం సినిమాకు ఏడు ఇంటర్నేషనల్ అవార్డులు రావడం, వేణుకు రెండు అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను 50 సినిమాలు చేసినా నాకు రాలేదు. తొలి సినిమాకే హర్షిత్ టీమ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది అని దిల్ రాజు చెప్పారు.

బలగం సినిమాను ఆస్కార్‌కు పంపిస్తాం
ఆస్కార్‌కు RRR సినిమా దారులు తెరిచింది. స్ట్రిమింగ్ చేయడానికి బడ్జెట్ ఎంతో తెలుసుకొంటాం. బడ్జెట్ ముఖ్యంగా కాదు. ది ఎలిఫెంట్ విష్పరర్ సినిమాకు ఆస్కార్ రావడానికి డబ్బులు ఖర్చుపెట్టలేదు. వారికి అవార్డు వచ్చిందనే విషయం కూడా తెలియదు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బలగం సినిమాను ఆస్కార్ అవార్డుల ప్రతిపాదనకు పంపిస్తాం. ఆస్కార్ బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తాం. రాజమౌళి కుమారుడు కార్తీకేయతో ఇటీవల మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను అని దిల్ రాజు చెప్పారు.

ఇంటర్నేషనల్ స్థాయి సినిమాల గురించి
ఇంటర్నేషన్ అవార్డులు చూస్తే గుండె ఆగిపోతున్నది. ఇంటర్నేషన్ సినిమాలు గురించి ఆలోచన ఇప్పట్లో లేదు. ఇంటర్నేషన్ స్థాయిలో సినిమాలు చేయాలని ఉంది. కానీ ఇప్పడే కాదు. భవిష్యత్‌లో అలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా నిర్మిస్తాం. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి సినిమాలు చేయాలని ప్రణాళిక ఉంది అని దిల్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











