వదినగారి వేటలో నలుగతున్న దిల్ రాజు
దిల్ రాజు ప్రస్తుతం తన దృష్టిని అంతటినీ వదిన గారి పాత్రను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్ అన్నయ్య గా చేస్తున్నారు.ఆయన ప్రక్కన చేసే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.అందులో మహేష్ కి వదిన పాత్ర అనే సరికి ఏ హీరోయిన్ ఆసక్తి చూపటం లేదు.పోనీ క్యారెక్టర్ ఆర్టిస్టుని తీసుకొద్దామంటే వెంకటేష్ తన ప్రక్కన పెద్ద హీరోయిన్ నే తేవాలనే నిర్మాతకు సూచించాడని తెలుస్తోంది.ఈ స్ధితిలో దిల్ రాజు నలిగిపోతున్నట్లు చెప్తున్నారు.త్రిషని అడిగారు కానీ ఆమె మహేష్ కు వదిన గా చేయటం అనేదాన్ని జీర్ణించుకోలేనని ఖచ్చితంగా చెప్పేసి రిజక్టు చేసేసింది.భూమికని,స్నేహను వెంకటేష్ రిజక్టు చేసినట్లు చెప్తున్నారు.ఇలా ఇప్పుడు కరెక్టుగా వెంకటేష్ ప్రక్కన సరిపోవాలి,ఆమె మహేష్ కి వదిన అంటే ఓకే అనాలి అలాంటి ఆమె కోసం వెతుకుతున్నారు.అందులోనూ మహేష్ కు వదిన గా చేస్తే హీరోయిన్స్ తమ కెరీర్ అక్కడితే ఫినిష్ అయినట్లే అవుతుందని,తమను ఆ తర్వాత ఎవరూ యంగ్ హీరోల ప్రక్కన బుక్ చేయరని రిజెక్టు చేస్తున్నారు.మరో ప్రక్క దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కూడా ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారు.షూటింగ్ డిసెంబర్ ఐదనుంచి ప్రారంభం కావాల్సి ఉంది.ఇక మహేష్ ప్రక్కన మాత్రం సమంతనే హీరోయిన్ గా తీసుకున్నారు.దూకుడుతో హిట్ పెయిర్ అయిన ఈ జంట భాక్సాఫీస్ వద్ద మరోసారి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











