మీరు కవలలా? అయితే దిల్ రాజుని కలవండి
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కవల సోదరులు కోసం వేట సాగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ పై తాము నిర్మించనున్న ప్యామిలీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ అవసరం ఏర్పడింది. కాజల్, తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి దశరథ్ దర్శకుడు. మూడో షెడ్యూలు పూర్తయిన ఈ చిత్రం లో పాటల్ని త్వరలో ఆస్ట్రేలియాలో చిత్రీకరిస్తారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. "ఇదో చక్కని కుటుంబ కథా చిత్రం. మూడు సంవత్సరాల కిందట వచ్చిన ఆలోచనని ఇన్నేళ్లు కష్టపడి కథగా మలిచాం. కుటుంబాల్లోని అనురాగాల్నీ ఆప్యాయతల్నీ ఇందులో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇది తమ పాత్రే అనుకుంటారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలకు కవల సోదరులు కావాలి. మా ప్రకటనకు స్పందించి చాలామంది మమ్మల్ని సంప్రదించారు. 35-40 సంవత్సరాల మధ్యనున్న కవలల ఫొటోల్ని కొన్ని పరిశీలించాం. సంతృప్తికరంగా అనిపించలేదు. అందుకే వాళ్ల కోసం ఎదురు చూపులు కొనసాగిస్తున్నాం. కవల సోదరులు ప్రపంచంలోని ఏ మూలున్నా [email protected] అనే చిరునామాకి మీ ఫోటోలు పంపండి" అన్నారు. త్వరలో నాల్గో షెడ్యూలు పూర్తిచేసి ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. నాజర్, బ్రహ్మానందం, రఘబాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాప్సీ ఇందులో అమెరికాలో ఉండే పాత్రను చేస్తోంది.


Click it and Unblock the Notifications











