దిల్ రాజు కుమారుడు ఎంత అందంగా ఉన్నాడో చూశారా? లీక్డ్ ఫోటో మీకోసం..

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. నితిన్ తో దిల్ అనే సినిమా తీసి... నిర్మాతగా మారాడు. ఈ సినిమానే తన ఇంటిపేరు అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రెండో వివాహం చేసుకున్న దిల్ రాజుకు కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లి తర్వాత మొదటి సారి దిల్ రాజు రెండో భార్య, కుమారుడి ఫోటో బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

మొదటి సినిమానే ఇంటిపేరుగా: వీవీ వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సినిమా దిల్. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి దిల్ రాజు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షాన్ని కురించింది. అయితే ఈ సినిమానే ఇంటిపేరుగా పెట్టుకునేంతగా గుర్తింపు తీసుకువచ్చింది. ఇక ఆయన దిల్ రాజుగా మారిపోయారు. వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నాడు. అగ్ర నిర్మాతల్లో ఒకరుగా వెలుగుతున్నారు.

Dil Raju Second Wife Son Photo Goes Viral in Social Media

50ఏళ్ల వయసులో తండ్రిగా: ఇదిలా ఉంటే.. ఆయన మొదటి భార్య కొన్నేళ్ల క్రితం అనిత అనారోగ్య సమస్యలతో మరణించింది. అయితే ఇటీవల ఆయన మరో వివాహం చేసుకున్నాడు. కరోనా సమయంలోనే... తన దూరపు బంధువు అయిన తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నాడు. గతఏడాది వీరికి బాబు కూడా జన్మించాడు. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు.

Dil Raju Second Wife Son Photo Goes Viral in Social Media

కుమారుడు పుట్టి సంవత్సరం: అయితే ఆ మధ్య దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. తాత వయసులో తండ్రి ఏంటి అంటూ కొన్నీ మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే... బాబు పుట్టినప్పుడు దిల్ రాజు ఎత్తుకున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత... అప్పటి నుంచి బాబు ఫొటో మళ్లీ బయటకు రాలేదు. తాజాగా దిల్ రాజు రెండో భార్య కొడుకు ఫొటో వైరల్ గా మారింది. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే... దిల్ రాజుకు కొడుకు పుట్టి సంవత్సరం అయింది.

Dil Raju Second Wife Son Photo Goes Viral in Social Media

దిల్ రాజు గ్రాండ్ పార్టీ: ఈ నేపథ్యంలోనే బాబుని టేబుల్ పై నించొని దిల్ రాజు పట్టుకున్నారు. పక్కనే తేజస్విని కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కొడుకు ఫస్ట్ బర్త్ డే కావడంతో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బర్త్ డే పార్టీని జెఆర్సీకి కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీనికోసం దిల్ రాజు టాలీవుడ్ ప్రముఖు సెలెబ్రిటీలందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Dil Raju Second Wife Son Photo Goes Viral in Social Media

భారీ బడ్జెట్ చిత్రం: అలాగే రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి కూడా బలగం చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రస్తుతం పలు చిత్రాలని నిర్మిస్తున్నారు. అందులో రామ్ చరణ్, శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X