twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్, పవన్ సినిమాలతో నష్టాలు.. వేరేవాళ్ళు అయితే సూసైడ్ చేసుకునేవారు: దిల్ రాజు

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఏడాదికి నాలుగైదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయనకు మంచి సక్సెస్ రేట్ ఉంది. చాలామంది నిర్మాతలు దిల్ రాజు సపోర్ట్ తోనే వారి సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.

    అయితే ఈ క్రమంలో గతంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాల వలన దారుణంగా నష్టాలు కలిగినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సూసైడ్ అనే మాటలు కూడా ఆయన ప్రస్తావనకు తీసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    వారసుడు వివాదం

    వారసుడు వివాదం

    దిల్ రాజు పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వారసుడు సినిమాకు సంబంధించి థియేటర్ల విషయంలో ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. దిల్ రాజు మిగతా సినిమాలకు సంక్రాంతిలో థియేటర్లో లేకుండా చేస్తున్నారు అని కూడా వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో అందులో ఎలాంటి నిజం లేదు అని తన సినిమాకు బిజినెస్ తగ్గట్టుగా సినిమాలు విడుదల చేస్తున్నట్లుగా తెలియజేశారు.

    కష్టనష్టాలు ఎదుర్కొన్నాను

    కష్టనష్టాలు ఎదుర్కొన్నాను

    తనను కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అని కూడా దిల్ రాజు గత ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్ గా కూడా తాను ఎన్నోసార్లు కష్టనష్టాలు ఎదుర్కొన్నాను అని ఏది కూడా ఇక్కడ అంత సులువుగా ఉండదు అని చెప్పారు. ముఖ్యంగా మొదట్లోనే కొన్ని సినిమాలతో దారుణంగా నష్టపోయాను అని ఆ తర్వాత కంటెంట్ చూసి తెలివితో సినిమాలను విడుదల చేసుకుంటూ ప్రాఫిట్ అందుకున్నట్లుగా చెప్పారు.

    రెండు సినిమాలతో నష్టాలే..

    రెండు సినిమాలతో నష్టాలే..

    అలాగే ఒక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలతో వరుసగా దారుణమైన నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా చెప్పారు. 2017లో మహేష్ బాబు స్పైడర్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలకు సంబంధించిన కొన్ని ఏరియా హక్కులను కొనుగోలు చేసినట్లు చెప్పిన దిల్ రాజు ఆ సినిమాలతో దారుణంగా నష్టపోయినట్లుగా తెలియజేశారు.

    సూసైడ్ చేసుకునేవారు

    సూసైడ్ చేసుకునేవారు

    స్పైడర్ సినిమాతో పాటు అజ్ఞాతవాసి రెండూ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో చాలావరకు డబ్బులు నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఆ ఏడాది మా బ్యానర్ లో వచ్చిన మిగతా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ కావడంతో నష్టాలను దీటుగా ఎదుర్కొన్నాను. అదే స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఆ సమయంలో సూసైడ్ చేసుకునేవారు. లేదంటే ఇండస్ట్రీ వదిలి పారిపోయేవారు అని దిల్ రాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

    కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు

    కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు

    అలాగే ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తక్కువగా చూడరు అని ఇక్కడ మిగతా సినిమాలు ఆడకూడదు అని కూడా ఎవరు అనుకోరు అని అన్నారు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలు ఎవరు ఆపినా కూడా అగవు. ఇటీవల వచ్చిన ఒక చిన్న సినిమా మసూద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. మంచి కంటెంట్ తో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా థియేటర్లో పెరుగుతాయని అన్నారు. అలాగే అనవసరంగా వారసుడు సినిమా విషయంలో కొన్ని వివాదాలు పుట్టిస్తున్నారని కూడా దిల్ రాజు తెలియజేశారు.

    English summary
    Dil raju shocking comments on pawan kalyan and mahesh babu movies..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X