దిల్ రాజు అల్లుడుకి యాక్సిడెంట్
హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా తన కుమార్తె హన్షిత రెడ్డి వివాహాన్ని ఘనంగా చేసిన సంగతి తెలిసిందే. వివాహానంతరం ఈ కొత్తజంట హానిమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. అయితే అక్కడో విషాద సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చిందని సమాచారం. హన్షిత రెడ్డి భర్త అర్చిత్ రెడ్డికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ యాక్సిడెంట్ లో అర్చిత్ రెడ్డి రెండు చేతులకు బాగా గాయాలకు అయ్యాయి. ఇండస్ట్రీలోని పెద్దలు, ఆయన శ్రేయాభిలాషులు అంతా ఈ విషయమై దిల్ రాజుకు ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్ళితే... స్కై డైవింగ్ స్కయింగ్ చేస్తున్నప్పుడు అర్చిత్ రెడ్డి ఫొటోలు తీయటానికి హ్యాండిల్స్ ని వదిలేసాడట. దాంతో అతను కంట్రోలు తప్పి క్రిందపడ్డాడని సమాచారం. దాంతో రెండు చేతులకు బాగా గాయాలయ్యాయి. ఓ చేతికి స్టీల్ రాడ్ వేసారని సమాచారం. మూడు నెలల అనంతరం ఈ ర్యాడ్ ని తొలిగిస్తారని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ దంపతులు మాల్దీవులు నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు.

దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి వివాహం మే 2 న గ్రాండ్ గా జరిగింది. వరుడు పారిశ్రామిక వేత్త అర్చిత్ రెడ్డి. వివాహం బంధువర్గం సమక్షంలో ఊటీలో సంప్రదాయబద్దంగా వివాహం జరిగింది. విందు,పెళ్లికి చెందిన ఏర్పాట్లు భారీ స్ధాయిలో చేసారు. పూలుని విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. తరువాత హైదరాబాద్ లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.


Click it and Unblock the Notifications











