»   » నా కూతురు అలా ఎందుకందో తెలియదు, అదే నిజమైంది: దిల్ రాజు

నా కూతురు అలా ఎందుకందో తెలియదు, అదే నిజమైంది: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డిజె ఆడియో వేడుకలో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు తనకు ఈ సినిమా ఎంత స్పెషలో చెప్పుకొచ్చాడు. మా వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి 14 సంవత్సరాలైంది. మా బ్యానర్‌లో దిల్‌ తొలి సినిమా అయితే సెకండ్‌ మూవీ నేను, బన్ని కలిసి ఆర్య చేశామని తెలిపారు.

సినిమా ప్రారంభంలో బన్ని ఒక హీరోగా, నేను నిర్మాతగా వ్యవహరిస్తే సినిమా ట్రావెల్‌లో ఓ కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయాం. అరవింద్‌గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసిపోయామని దిల్ రాజు వెల్లడించారు.


బన్నీతో

బన్నీతో

బన్నీకి, నాకు రెండో సినిమా ఆర్య, అదే విధంగా బన్నీకి, నాకు ఆరో సినిమా ‘పరుగు'. ఈ రెండు సినిమాలు మా బేనర్లోనే తెరకెక్కాయి. బన్నితో మళ్ళీ సినిమా తీయడానికి 9ఏళ్ళు పట్టిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


అప్పటి వరకు ఆగుదామన్నాడు

అప్పటి వరకు ఆగుదామన్నాడు

మా ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రావడానికి 9 సంవత్సరాల సమయం పట్టడానికి కారణం మంచి కథ, అది బన్నీకి సూటయ్యేలా ఉండాలి. దాని కోసమే ఆగాము. మళ్ళీ మన కాంబినేషన్‌లో సినిమా అంటే మంచి కథ ఉండాలని బన్ని చెప్పేవాడు. అది వచ్చిన రోజే సినిమా చేద్దామని బన్ని అనేవాడని దిల్ రాజు తెలిపారు.


నాలుగేళ్లుగా కథలు విన్నాం

నాలుగేళ్లుగా కథలు విన్నాం

బన్నీతో సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్ళు నుండి ఎన్నో కథలు వింటున్నా. ఏవీ వర్కవుట్‌ కాలేదు. హరీష్ డిజే కథతో రావడంతో ఎంతో నచ్చింది. నేను, హరీష్‌ రెండు సినిమాలు చేశాం. మా ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా... మా బ్యానర్‌కు 25వ సినిమా. మా బేనర్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా అని దిల్ రాజు తెలిపారు.


నా కూతురు అలా ఎందుకు అందో తెలియదు

నా కూతురు అలా ఎందుకు అందో తెలియదు

నా కూతురు ఓసారి 'నాన్న మన బ్యానర్‌లో 25వ సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలి..అది బన్ని అన్నయ్యతో బావుంటుంది' తను అలా ఎందుందో తెలియదు కానీ బన్ని, హరీష్‌ కాంబినేషన్‌లో 25వ సినిమా చాలా మంచి సినిమా చేశాం...సినిమా అందరినీ మెప్పిస్తుంది అని దిల్ రాజు తెలిపారు.


గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది

గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది

ఇపుడు సినిమా గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. జూన్‌ 23న సినిమానే మాట్లాడుతుంది. 23న సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది అని దిల్ రాజు కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు.English summary
Dil Raju speech at DJ - Duvvada Jagannadham Audio Launch. DJ Movie Starring AlluArjun, PoojaHegde. Directed by Harish Shankar & Produced by Dil Raju under the Banner Of Sri Venkateshwara Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu