‘ఎఫ్ 2’కే హయ్యెస్ట్ ప్రాఫిట్స్, కొన్ని హిట్టయినా డబ్బు రాలేదు: దిల్ రాజు సెన్సేషనల్ స్పీచ్
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్స్‌గా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన చిత్రం 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'. ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు స్పీచ్ ఆకట్టుకుంది.
దిల్ రాజు మాట్లాడుతూ... అనిల్ రావిపూడి మా సినిమా టైటిల్ ఎఫ్ 2 అని ఓం పెట్టి అనౌన్స్ చేశాడు. దాని తర్వాత వి2 అని ఇద్దరు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ఇ2(ఎంటర్టెన్మెంట్ ఎంటర్టెన్మెంట్) అని కొందరు మేసేజ్ పంపారు. ఫైనల్‌గా బి2(బొమ్మ బ్లాక్ బస్టర్) అనే బిరుదు కూడా ఇచ్చారు. మా బేనర్లో 31వ సినిమా ఈ సంక్రాంతికి అద్భుతమైన విజయం అందుకుందని తెలిపారు.

ఇంత పెద్ద హిట్టవుతుంది అనుకోలేదు
ఈ సినిమా ఎంటర్టెన్మెంట్ ఫిల్మ్... నవ్వులు ఉంటాయని ముందు నుంచీ చెబుతున్నాము. హిట్టవుతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని నేను కూడా ఊహించలేదు. ఆడియన్స్‌ను కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారని అర్థమైంది.

రూ. 50 కోట్లు క్రాస్ అయింది
వెంకటేష్ గారితో చేసిన సీతమ్మ వారికిట్లో సిరిమల్లె చెట్టు 50 కోట్ల క్లబ్ లో చేరింది. తర్వాత వరుణ్ ‘ఫిదా' 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఇపుడు ఇద్దరూ కలిపి 50 కోట్లు క్రాస్ చేశారు. మా హీరోలకు ఇలాంటి సక్సెస్ వచ్చినందుకు మా సంస్థ చాలా సంతోషంగా ఉంది.

మాకు హయ్యెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిన సినిమా
అనిల్ చాలా సక్సెస్‍లు చూశాడు... కానీ ఇలాంటి కిక్ ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా ఆడియన్స్‌కు రీచ్ అయితే ఇలా ఉంటుందా? ఇలాంటి ఫిగర్స్ వస్తాయా? అని ఊహించి కూడా ఉండరు. ఈ సినిమా ద్వారా ఎస్వీసికి హయ్యెస్ట్ ప్రాఫిట్ రావాలి సార్ అన్నాడు. ఆయన విష్ తప్పకుండా నెరవేరుతుంది. గొప్పగా చెబుతున్నాను. 31వ సినిమా ఎస్వీసికి అన్ని సినిమాల్లోకెల్లా హయ్యెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిన సినిమా అయింది.

కొన్ని హిట్టవుతాయి కానీ డబ్బులు రావు
కొన్ని మంచి సినిమాలకు అప్రిషియేషన్ ఉంటుంది కానీ డబ్బు రాదు. పేరు, డబ్బు ఆ రెండు కలిసి రావడం అరుదుగా జరుగుతుంది. దేవిశ్రీ మా బేనర్లో 10 సినిమాలు చేస్తే అన్నీ సక్సెస్ అయ్యాయి. మా కాంబినేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











