చిరంజీవి స్థాయి తగ్గించలేదు: ఖైదీ నెం 150, డిజె గొడవపై దిల్ రాజు

ఖైదీ నెం 150, డిజె వివాదంపై దిల్ రాజు స్పందించారు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆయన తెలిపారు.

By Bojja Kumar

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసు వద్ద మెగా అభిమానులు ఆందోళన చేసినట్లు నిన్న వార్తలొచ్చాయి. ఈ సంఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఖైదీ నెం.150, డిజె కలెక్షన్ విషయంలోనే ఈ ఆందోళన జరిగినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో కూడా ఈ విషయమై వివాదం సాగుతోంది. ఖైదీ నెం 150 సినిమా కంటే డిజె కలెక్షన్లు ఎక్కువ వచ్చాయని హైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం 'ఫిదా' ఆడియో వేడుకలో దిల్ రాజు స్పందించారు.

కంపేరిజన్ వద్దు

కంపేరిజన్ వద్దు

ఈ మధ్య సోషల్ మీడియాలో ఖైదీ నెం.150, డిజె విషయంలో వాంటెడ్‌గా ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఖైదీ నెం 150 చిరంజీవిగారి స్పెషల్ ఫిల్మ్. ఆయన రేంజి ఎప్పుడూ తగ్గదు. చిరంజీవి గారు ఎప్పుడూ అదే రేంజిలో ఉంటారు. దానికి దీనికి అసలు కంపేరిజన్ లేదు అని దిల్ రాజు అన్నారు.

Recommended Video

Dil Raju Speech Over DJ Collections @DJ Thank You Meet
చిరంజీవిగారితో ఎన్నో మూమెంట్స్

చిరంజీవిగారితో ఎన్నో మూమెంట్స్

నేను ఆడియన్‌గా ఉన్నపుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతుతోంది. అలా తొలి సారి ప్రేక్షకుడిగా వెళ్లి సినిమా షూటింగులో ఆయన్ను దగ్గరగా చూశాను. అల్లుడా మజాకా సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా చిరు ద్వారా షీల్డ్ తీసుకున్నాను. ఆర్య కథ సుకుమార్ చిరంజీవికి చెబుతుంటే బయట డోర్ దగ్గర వెయిట్ చేశాను....ఇలా ఎన్నో మూమెంట్స్ ఆయనతో ఉన్నాయని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే...

చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే...

చిరంజీవి‌గారు ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్, అర్జున్, చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా వచ్చారు. ఒక మనిషి ద్వారా ఇంత మంది హీరోలుగా ఎదిగారు. చిరంజీవిని తలుచుకోకుండా ఏ ఫంక్షన్ జరుగదు. ఆయన సినిమాకు ఎంతో విలువ ఇస్తారు. అందరికంటే గొప్పది సినిమా అని చెబుతుంటారు అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

ఫిదా ఖుషి లాంటి సినిమా

ఫిదా ఖుషి లాంటి సినిమా

శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఎలాగో.... ఫిదా ఖుషి లాంటి సినిమా. శేఖర్ కథ చెప్పినపుడు వరుణ్‌తో చేద్దామని నేనే చెప్పాను. హీరో అప్ కమింగ్‌లో ఉన్నపుడు ఇలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ కు బాగా దగ్గరవుతుంది. పవన్ కళ్యాణ్ తొలినాళ్లలో చేసిన సుస్వాగతం, తొలి ప్రేమ.... బన్నీ చేసిన 'ఆర్య' సినిమాలే ఇందుకు నిదర్శనమని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X