రూ. 40 అడ్వాన్స్, షాకయ్యాం, మెగా ఝలక్, పవన్ తర్వాత విజయ్ దేవరకొండ సెన్సేషన్!

By Bojja Kumar

Recommended Video

Dil Raju Speech at Geetha Govindam Success Meet

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బన్నీ వాస్ గురించి, విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగా ఝలక్, 8 నెలలు వెయిట్ చేయాలి

మెగా ఝలక్, 8 నెలలు వెయిట్ చేయాలి

మరో రెండు రోజుల్లో బాస్ మెగాస్టార్ సెలబ్రేషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఆ రోజు చిన్న టీజర్ ద్వారా చిన్న ఝలక్ ఇవ్వబోతున్నారు. ఆ టీజర్ చూసి మనం 8 నెలలు సినిమా కోసం వెయిట్ చేయాలని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

రూ. 40 అడ్వాన్స్ ఇచ్చాడు

రూ. 40 అడ్వాన్స్ ఇచ్చాడు

ఆర్య సినిమా తీస్తున్న సమయంలో బన్నీ వాస్ పాలకొల్లు సెంటర్ కావాలని నా దగ్గరికి వచ్చాడు. ఆ ఒక్క సెంటరే ఎందుకు మొత్తం వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అవ్వమని చెప్పాను. అపుడు నాకు రూ. 40 అడ్వాన్స్ ఇచ్చి 15 సంవత్సరాల్లో నా స్థాయికి ఎదిగాడు. వాసుకు హాట్సాఫ్. సినిమాను నమ్ముకుని కష్టపడితే విజయం సాధించ వచ్చని అరవింద్ గారి తర్వాత ప్రూవ్ చేశాడు... అని దిల్ రాజు అన్నారు.

 ఈ సినిమా ప్రభంజనం చూసి షాక్

ఈ సినిమా ప్రభంజనం చూసి షాక్

డైరెక్టర్ పరశురాం నన్ను తొలిసారి కొడైకనాల్‌లో ఓ చిన్న స్టోరీ చెబుతాను అని కలిశాడు. 11 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ అంతా షాకయ్యే సినిమా చేశాడు. ఒక సినిమా తీస్తే ఇలా ట్రెండ్ సెట్ చేయవచ్చని, ఇంత రెవెన్యూ క్రియేట్ చేయవచ్చని నిరూపించాడు. 5 రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు మాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి అన్నారు.

పవన్ తర్వాత విజయ్ దేవరకొండ

పవన్ తర్వాత విజయ్ దేవరకొండ

15 సంవత్సరాల్లో చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అందరూ స్టార్స్ అయ్యారు. 20 సంవత్సరాల క్రితం తొలి ప్రేమ సినిమాతో యూత్ మొత్తంలో పవన్ కళ్యాణ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. తర్వాత విజయ్ అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఒక సినిమాకు ఇంత ఫోబియా ఉంటుందని పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ సినిమా ద్వారా రుజువైంది. అర్జున్ రెడ్డి ఏదో వచ్చిందిలే కొట్టేశాడు... సడెన్ గా చాలా సినిమాలు వస్తాయి కొట్టేస్తాయి అనుకున్నాం. అర్జున్ రెడ్డితో కాదు ఈ సినిమాతో విజయ్ స్టార్ హీరో రేంజికి వెళ్లాడు.. అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X