'118' ప్రీ రిలీజ్ ఈవెంట్: ఖుషి నుంచి తెలుసు.. వరుసపెట్టి నందమూరి హీరోతో.. దిల్ రాజు!

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం 118. సస్పెన్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ తొలిసారి దర్శత్వం వహిస్తున్న చిత్రం ఇది. మార్చి 1న 118 విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం రోజు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ, ఎన్టీఆర్ అతిథులుగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నందమూరి అభిమానులని ఆకట్టుకునే ప్రసంగించారు.

 ఖుషి నుంచి తెలుసు

ఖుషి నుంచి తెలుసు

నందమూరి నటసింహం బాలయ్యకి, మన సింహాద్రి ఎన్టీఆర్ కి, మన పటాస్ కళ్యాణ్ రామ్, అలాగే నందమూరి అభిమానులందరికి నమస్కారం అంటూ దిల్ రాజు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ చిత్ర దర్శకుడు కెవి గుహన్ తనకు ఖుషి చిత్రం నుంచి పరిచయం అని అన్నారు. ఖుషి చిత్రానికి గుహన్ అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసినట్లు దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా మారి, ఇప్పుడు దర్శకుడి స్థాయికి చేరుకున్నారని దిల్ రాజు తెలిపారు.

కొత్తదనం కోసం

కొత్తదనం కోసం

కళ్యాణ్ రామ్ తన ప్రతి చిత్రంలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. ఈ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు పీఆర్వో గా మొదలై ఇప్పుడు వరుసపెట్టి నందమూరి ఫ్యామిలీ సినిమాలు నిర్మిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రల్లో తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని దిల్ రాజు తెలిపారు.

 నివేద థామస్

నివేద థామస్

118 చిత్రంలో నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేద థామస్ మాట్లాడుతూ.. తాను బాలకృష్ణకు చాలా పెద్ద అభిమానిని అని, ఆయన్ని ఇంత దగ్గరగా చూస్తుండడం చాలా సంతోషంగా ఉందని నివేద థామస్ తెలిపింది. 118 లాంటి వైవిధ్యభరితమైన చిత్రంలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని నివేద అభిప్రాయపడింది. ఈ చిత్రాన్ని చూస్తే విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయని నివేద తెలిపింది.

 అందమైన ఎమోషన్స్

అందమైన ఎమోషన్స్

మరో హీరోయిన్ షాలిని పాండే మాట్లాడుతూ.. 118 చిత్రం అందమైన ఎమోషన్స్ తో చిత్రీకరించబడింది అని తెలిపింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందని షాలిని పాండే తెలిపింది. తనకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథులు గా హాజరైన ఎన్టీఆర్, బాలకృష్ణకు కూడా షాలిని పాండే థాంక్స్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X