గతేడాది వరుస సక్సెస్‌లు కొట్టాం... ఇపుడు కాస్త నర్వెస్‌గా ఉంది: దిల్ రాజు

By Bojja Kumar

రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ‌ర్‌. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 20న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది వరుసగా ఆరు సక్సెస్‌ కొట్టాం.. ఫోర్లు, సిక్సులు కొట్టిన తర్వాత బాల్ కొట్టేపుడు బ్యాట్స్‌మెన్‌కు ఎంత నర్వస్ ఉంటుందో... ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉందని వ్యాఖ్యానించారు.

మా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్

మా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్

మా ఫ్యామిలీలో హర్షిత్ సెకండ్ జనరేషన్ కిడ్. తను సొంతగా సినిమా చేస్తానంటే.. అనీశ్ చెప్పిన క‌థ‌తో సినిమా మొదలు పెట్టాం. నిర్మాత‌గా హ‌ర్షిత్ తొలి సినిమా ఇది. నా తొలి సినిమాకు కూడా నెర్వ‌స్ ఫీల్ కాలేదు .. కానీ ఈ సినిమా కాస్త నెర్వ‌స్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయ‌డానికి, వెన‌కుండి చేయించ‌డానికి చాలా తేడా ఉంది. చాలా క‌ష్ట‌మైన ప‌ని కూడా. ఎందుకంటే మ‌న‌కి కొన్ని న‌చ్చుతాయి. వాళ్లికి వేరే న‌చ్చుతాయి. వాళ్లే క‌రెక్ట్ అని అంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత ట‌ఫ్ జాబ్ డైరెక్ట‌ర్స్‌తో ఫేస్ చేశాను. ఈసారి హ‌ర్షిత్‌తో ఫేస్ చేశాను.... అని దిల్ రాజు తెలిపారు.

నన్ను నమ్మి మా బాబాయ్‌లు రూ. 10 కోట్లు పెట్టారు

నన్ను నమ్మి మా బాబాయ్‌లు రూ. 10 కోట్లు పెట్టారు

ముందుగా నేను మా బాబాయ్‌లు ఇద్దరికీ థాంక్స్ చెప్పుకోవాలి. మామూలుగా అయితే సినిమా చేస్తానంటే పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు, బాబాయ్‌లు ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా? అది మా బాబాయ్‌ల గొప్పతనం. ఒక పది కోట్లు పెట్టారు... అని హర్షిత్ తెలిపారు.

దిల్ రాజు అలా చెబుతుంటే దర్శకుడిగా సిగ్గేసింది

దిల్ రాజు అలా చెబుతుంటే దర్శకుడిగా సిగ్గేసింది

దిల్‌రాజు ఎంత ప్యాష‌నేట్ ఫిలిమ్ మేక‌రో నేను కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక ఎంగ్జాంపుల్ చెబుతాను. `మేం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను అనంత‌పురంలో షూట్ చేస్తున్నాం. రాత్రి ప‌న్నెండు, ఒంటి గంట ప్రాంతంలో నేను, హ‌ర్షిత్ డిస్క‌స్ చేసుకుంటున్నాం. ఒక డౌట్ వ‌చ్చింది. దిల్‌రాజుకి ఈ సమ‌యంలో ఫోన్ చేస్తే బావుంటుందా? అని ఆలోచిస్తూనే కాల్ చేశాం. ఆయ‌న ప్ర‌తి సీన్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం చూసి సినిమా డైరెక్ట‌ర్ నాకే అలా గుర్తు లేదే అని సిగ్గుప‌డ్డాను..`` అంత మంచి ప్యాష‌నేట్ వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే హ‌ర్షిత్‌గారు నాకు అండ‌గా నిల‌బడ్డారు... అని దర్శకుడు అనీష్ కృష్ణ తెలిపారు.

లవర్ ట్రైలర్

జులై 20న లవర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచింది. ‘‘నేను రాష్ట్రంలోనే బెస్ట్ కస్టమైజ్డ్ మోటార్ బైక్ బిల్డర్. ఎవడో చేసిన బైక్ నాకెందుకు? నాకు నచ్చినట్లు నేను చేసుకుంటా. అది బైకయినా, లైఫయినా'' అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X