twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఓకే అనగానే వంశీ ఏడ్చేశారు, మే 9న కాలర్ ఎగరేస్తాడు: ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంటులో దిల్ రాజు

    |

    సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.

    మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారని సందేశాలు పంపుతున్నారు

    ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారని సందేశాలు పంపుతున్నారు

    నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... మహేష్ బాబు అభిమానులు ఎంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారో.. ‘మహర్షి' అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. మే 9న మీ కోరిక తీరబోతోంది. మేము పిలవగానే వచ్చిన వెంకటేష్, విజయ్, కొరటాల శివ అందరికీ థాంక్స్. ఇది చాలా పెద్ద జర్నీ.. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో మూడు పెద్ద బ్యానర్లు కలిసి చేశాం. మీకు అద్భుతమైన సినిమా ఇస్తున్నామనే నమ్మకంతో ఉన్నాం. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారని సందేశాలు పంపుతున్నారు.

    2 డ్యూయెట్లు, 4 మాంటెజ్ సాంగ్స్

    2 డ్యూయెట్లు, 4 మాంటెజ్ సాంగ్స్

    ఎంత ఒత్తిడి ఉన్నా డిఓపి మోహనన్ గారు సెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాకప్ అయ్యే వరకు తన స్మైల్‌తో అందరికీ ఎనర్జీ ఇచ్చేవారు. ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్ అందరూ బాగా చేశారు. 2017 అక్టోబర్లో మొదట వంశీ దేవిశ్రీకి అమెరికాలో కథ చెప్పాడు. అప్పటి నుంచి దేవితో దాదాపు సంవత్సరన్నర ట్రావెల్ చేశాడు. కమర్షియల్ సినిమాల్లో... ఇంట్రడక్షన్ సాంగుతో కలిపి 6 పాటలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో 2 డ్యూయెట్స్, 4 మాంటెజ్ సాంగ్స్ ఉన్నాయి. ఒక స్టార్ సినిమాలో నాలుగు మాంటెజ్ సాంగ్స్ అంటే కథ గురించి ఆలోచించే వారికే అర్థమవుతుంది ఇది ఎంత పెద్దదో.

    దేవికి ఇది చాలా కష్టమైన సినిమా

    దేవికి ఇది చాలా కష్టమైన సినిమా

    దేవికి ఇది చాలా కష్టమైన సినిమా... ప్రతి సాంగ్ వంశీ అడిగినట్లు, సినిమాలో ఏ ప్లేసులో ఏ సాంగ్ రావాలి అనేది చాలా కష్టపడి చేశారు. రేపు సినిమా చూసేపుడు విజువల్స్‌తో పాటు సంగీతం ఎక్స్ ట్రార్డినరీ‌గా ఎంజాయ్ చేస్తారు. టోటల్ ఆల్బం థియేటర్లో మారుమ్రోగిపోవడం గ్యారంటీ. శ్రీమణికి సింగిల్ కార్డ్ పాటలు రాసే అవకాశం వచ్చింది. అతడు ప్రాణం పెట్టి రాశాడు. పదర పదర సాంగ్ కంప్లీట్ అయ్యాక లిరిక్ వింటే... సీతారామశాస్త్రిగారిని గుర్తొచ్చాడు. అంత యంగ్ ఫెల్లో అంత సెన్సబుల్ గా లిరిక్ రాయడం గ్రేట్.

    మే 9న మీరంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు

    మే 9న మీరంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు

    ఈ సినిమాకు మూల కారకులు వంశీ, హరి, సాల్మన్. ఈ కథ పుట్టడానికి కారణం వీరు. సినిమా కంప్లీట్ అయ్యే వరకు వంశీ పక్కన ఉండి హరి, సాల్మన్ ఇచ్చిన సపోర్ట్, ఇన్వాల్ అయిన తీరు నాకు తెలుసు. మే 9న మీరంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు.

    మహేష్ గారు ఓకే చెప్పినపుడు వంశీ దాదాపు ఏడ్చేశారు

    మహేష్ గారు ఓకే చెప్పినపుడు వంశీ దాదాపు ఏడ్చేశారు

    ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్‌తో పాటు చాలా మంది యాక్ట్ చేశారు. అల్లరి నరేష్ క్యారెక్టర్ రేపు సినిమాలో అద్భుతంగా ఉంటుంది. వంశీ ‘ఊపిరి' తర్వాత మహేష్ గారికి ఈ కథ చెప్పారు. అపుడు మహేష్ గారు ఈ సినిమా చేయాలా? వద్దా? అనే చిన్న డైలమాలో ఉన్నారు. వంశీ అదే ఎనర్జీతో స్క్రిప్టు కంప్లీట్ చేసి ఆయన్ను ఒప్పించాడు. ఈ సినిమా చేస్తున్నాను అని మహేష్ గారు చెప్పినపుడు వంశీ దాదాపు ఏడ్చేశారు. సంవత్సరన్నర కథ తయారు చేసి, ఒక హీరోతో ట్రావెల్ అయ్యి అది సాధించాడు. వంశీ తీసిన చిత్రాల్లో ఇది బెస్ట్ సినిమా, ఒక మైలు రాయి అవుతుంది.

    నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను

    నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను

    ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన నిర్మాతగా ఒక చిత్రాన్ని అంచనా వేయగలం. ఇటీవల సినిమా చూస్తున్నపుడు వంశీకి వాట్సాప్‌లో దండం పెడుతూ మెసేజ్ పెట్టాను. క్లైమాక్స్ చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను.

    మహేష్ బాబు హగ్ ఇచ్చాడు, అదొక గ్రేట్ మూమెంట్

    మహేష్ బాబు హగ్ ఇచ్చాడు, అదొక గ్రేట్ మూమెంట్

    లాస్ట్ డే షూటింగ్ రోజు అది. నేను అందరు హీరోలతో చాలా క్లోజ్‌గా ఉంటాను. కానీ మహేష్ గారు ఎప్పుడూ నాకు షేక్ హ్యాండే ఇస్తారు. ఆయన ఎవరికైనా షేక్ హ్యాండే ఇస్తారు. లొకేషన్ వెళ్లిన తర్వాత అందరు టెక్నీషియన్లకు హగ్ ఇచ్చాను. మహేష్ గారికి ఇవ్వాలా? వద్దా? అని దూరంగా వెళ్లిపోయాను. అపుడు మహేష్ గారు వచ్చి నాకు హగ్ ఇవ్వరా అన్నారు. అదొక గ్రేట్ మూమెంట్. ఒక సినిమా కోసం ఎంతో మంది కలుస్తాం. అయిపోగానే మళ్లీ నెక్ట్స్ సినిమాకు షిప్ట్ అయిపోతాం. ఇది ఒక గొప్ప అవకాశం. దత్ గారు, పివిపి గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది.

    మే 18న సక్సెస్ మీట్

    మే 18న సక్సెస్ మీట్

    పివిపి మాట్లాడుతూ... ‘మహర్షి' చిత్రం గ్యారంటీ సక్సెస్ అవుతుంది. అందుకే హీరోగారికి కూడా చెప్పకుండా మే 18న విజయవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఇలాంటి అద్భుతమైన సినిమా అందించిన కాస్ట్ అండ్ క్రూకు థాంక్స్.' అన్నారు.

    English summary
    Dil Raju speech at Maharshi Pre Release Function. Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh,Ananya and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad.It is to be released on 9 May 2019. In this occcasion, Film unit organised a Pre release event at Hyderabad Neckles Road on May 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X