సైరా సినిమా చూస్తుంటే ఏడుపొచ్చింది.. హాట్సాఫ్ సూరి: దిల్ రాజు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్బంగా సైరా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ.. పరుచూరి వారి 15 సంవత్సరాల కల, చిరంజీవి 12 ఏళ్ల కల ఈ రోజు నెరవేరిందని అన్నారు. మొదటి రోజే ఈ సినిమా 85 కోట్ల గ్రాస్ రాబట్టిందని, ఇది సూపర్ ఫిగర్ అని చెప్పారు. చిరంజీవి సినిమాల్లో 151 వ సినిమా అయిన సైరా ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమా అని, ఇదో రెస్పెక్టెడ్ సినిమా అని అన్నారు దిల్ రాజు.

 Dil Raju speech at Sye Raa Thank You Meet.. Appreciates Ram charan

అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నయనతార, తమన్నా, సుదీప్.. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నానని, కానీ నిన్న మార్నింగ్ సైరా సినిమా చూస్తుంటే తనకు మూడు సార్లు ఏడుపొచ్చిందని చెప్పారు దిల్ రాజు. సురేందర్ రెడ్డి ఎమోషన్స్ బాగా పండించారని పేర్కొంటూ హాట్సాఫ్ సూరి అన్నారు. చిరంజీవి డ్రీమ్‌ని నిజం చేసిన రామ్ చరణ్‌ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాని అన్నారు దిల్ రాజు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X