Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీనివాస కళ్యాణం డివైడ్ టాక్ వారివల్లే.. రిలీజ్‌కు ముందే దంచికొట్టారు.. దిల్ రాజు!
Recommended Video
యంగ్ హీరో నితిన్, రాశి ఖన్నా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ యువతలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. వివాహ ప్రాముఖ్యతని తెలియజేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజగా శ్రీనివాస కళ్యాణం సక్సెస్ మీట్ లో దిల్ రాజు, నితిన్, రాశి ఖన్నా, చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్
దిల్ రాజు మాట్లాడుతూ.. శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే శ్రీనివాస కళ్యాణం చిత్రం విజయం సాధించింది అనడానికి నిదర్శనం అని దిల్ రాజు అన్నారు.
డివైడ్ టాక్
యువతలో ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తున్న విషయాన్ని దిల్ రాజు ప్రస్తావించారు. శతమానం భవతి తరువాత సతీష్ దర్శత్వంలో, దిల్ తరువాత నితిన్ హీరోగా తాను నిర్మించే చిత్రం కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలు మరింత పెంచేలా ఆడియో వేడుకలో మా ఆర్టిస్టులు కొడుతున్నాం.. కొడుతున్నాం అంటూ అంచనాలు ఇంకా పెంచేశారు. దానివలన కూడా యువత కొత్త నిరాశ చెంది ఉంటారు.
రెండవ రోజు
రెండవరోజు నుంచి యువత కూడా బావుందని చెబుతున్నారు. కానీ టాక్ ఎందుకు అలా వచ్చింది అని వారే ఆశ్చర్యపోతున్నారని దిల్ రాజు తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం యునానిమస్ టాక్ ఉందని దిల్ రాజు తెలిపారు.
ప్రతి షోకి
తొలి షోలో కొత్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ షోలు పెరిగేకొద్దీ పాజిటివ్ టాక్ పెరుగుతోందని నితిన్ అభిప్రాయపడ్డాడు. అందరికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది అని రాశి ఖన్నా తెలిపింది.