నితిన్‌కు వరుసగా ప్లాపులు.. ఇంటికొచ్చి అడిగాడు, ఎంతో ట్రై చేశా, కానీ.. దిల్ రాజు!
Recommended Video

యంగ్ హీరో నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదివారం ఘనంగా ఆడియో వేడుక నిర్వహించారు. నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో దాదాపు 15 ఏళ్ల తరువాత రూపొందబోతున్న చిత్రం ఇది. నితిన్ తో మరో సినిమాకు ఇంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని దిల్ రాజు ఆడియో వేడుకలో వివరించారు. శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందని అన్నారు.

ఇంటికొచ్చి అడిగాడు
దిల్ చిత్రం తరువాత నితిన్ తో చాలా సినిమాలు అనుకున్నాం.. కుదరలేదు. ఒక సందర్భంలో నితిన్ వరుసగా ప్లాపుల్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో సినిమా చేయమని ఇంటికొచ్చి అడిగాడు.

ఎంత ప్రయత్నించినా
ఆ సమయంలో కూడా సినిమా చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదని దిల్ రాజు తెలిపాడు. శ్రీనివాస కళ్యాణం లాంటి అద్భుతమైన చిత్రంలో నటించాలని ఉంది కాబట్టి అప్పుడు సినిమా కుదరలేదని దిల్ రాజు తెలిపాడు. ఈ సినిమా కోసమే భగవంతుడు 15 ఏళ్ళు వేచి ఉండేలా చేసాడని దిల్ రాజు అన్నారు.

తొలి ప్రేమ తరువాత
తొలిప్రేమ చిత్రం చూశాక ఈ చిత్రానికి రాశి ఖన్నా అయితే బావుంటుందని భావించా. ఈ విషయాన్నీ దర్శకుడికి చెబితే రాశి ఖన్నానా అని సంశయించారు. అంతుకు ముందు రాశి వేరు, తొలి ప్రేమ చిత్రం తరువాత రాశి ఖన్నా వేరు. ఆమె ఇప్పుడు అద్భుతంగా నటిస్తోందని దిల్ రాజు తెలిపారు.

వాళ్ళ మేనేజర్లని
ఈ చిత్రంలో రాశి ఖన్నాని ఎంపిక చేసిన తరువాత ఆమెకు ఈ విషయం చెప్పాం. అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు తన మేనేజర్లని మా ఆఫీస్ లోనే కూర్చోబెట్టిందని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











