ఎన్టీఆర్ ని కొత్తగా చూపిస్తున్నాం: దిల్ రాజు
తారక్ ని కొత్తగా చూపించే చిత్రమిది. సినిమా పేరుకు తగ్గట్టు కుటుంబ బంధాలూ, ఆప్యాయతల్ని చూపిస్తున్నాం. ఎన్టీఆర్ మాట్లాడేతీరు, తెర మీద కనిపించే విధానం, వస్త్రధారణ ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఆయన శైలిని కూడా మర్చిపోలేదు. తారక్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో.. అవన్నీ కలగలిసిన చిత్రమిదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఫైట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఆగస్టులో ప్రేక్షకుల రిలీజయ్యే ఈ చిత్రంలో కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు. శ్రీహరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడు' ట్యాగ్ లైన్ పెట్టారు.
జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం కాజల్ సమంత శ్రీహరి ప్రకాష్ రాజ్ jr ntr srihari kajal samantha dil raju vamsi paidipally


Click it and Unblock the Notifications