జూ ఎన్టీఆర్ మోడ్రన్ శ్రీకృష్ణుడు...దిల్ రాజు

By Srikanya

మోడరన్ శ్రీకృష్ణుడిలా కనిపిస్తాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లో ఇది వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే ఈ ఏడాది టాప్ 3 సినిమాల్లో 'బృందావనం' ఒకటిగా నిలుస్తుందనీ, ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదనీ, సినిమా చూసుకున్నాకే గట్టి నమ్మకంతో చెబుతున్న మాట అనీ ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హీరోగా; కాజల్ అగర్వాల్, సమంతా హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ చివరి పాట చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "ప్రస్తుతం స్విట్జర్లాండులో చివరి పాటని చిత్రీకరిస్తున్నాం. 10తో షూటింగంతా అయిపోతుంది. 12న పాటల్నీ, అక్టోబర్ 1న సినిమానీ విడుదల చేయబోతున్నాం. 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. 'మున్నా'ని డైరెక్ట్ చేసిన వంశీకి ఈ సినిమా ఒక అచీవ్‌మెంట్ అవుతుంది. అతను అద్భుతంగా కథ తయారుచేసుకుని, ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా తయారవుతోంది. కాజల్, సమంతా పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. 36 మంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా ఒక షడ్రుచుల భోజనంలా ఉంటుంది" అని రాజు చెప్పారు.ధమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్, కళ: ఆనందసాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X