For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ రాజు కొత్తట్రెండ్... ప్రెగ్నెంట్ లేడీతో పోల్చిన తమన్నా!

  |

  వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. నేటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్-లక్ష్మణ్ నిర్మించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టెనర్ 2019 సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా దిల్ రాజు చిత్ర బృందంతో కలిసి మీడియాతో ఈ ఆనందాన్ని పంచుకున్నారు.

  అందరూ సక్సెస్‌లో భాగం అయ్యారు

  అందరూ సక్సెస్‌లో భాగం అయ్యారు

  ఎఫ్ 2 మూవీ సంక్రాంతికి విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు, మీడియా వారికి, ఇండస్ట్రీ స్నేహితులకు థాంక్స్ చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేటితో మా సినిమా 2 వారాలు పూర్తయింది. అన్ని చోట్లా చాలా బాగా రన్ అవుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌కు స్పెషల్ థాంక్స్. తమన్నా, మెహ్రీన్, డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరూ సినిమా విజయంలో భాగం అయ్యారని దిల్ రాజు తెలిపారు.

  రూ 100 కోట్లు కొట్టాం

  రూ 100 కోట్లు కొట్టాం

  2 వారాల్లో 100 కోట్లు గ్రాస్ సాధించడం మా టీమ్ మొత్తానికి హ్యాపీ మూమెంట్. ఇది ఎప్పుడు అవుతుందా? అని చాలా ఆతృతగా ఎదురు చూశాం. కలెక్షన్లు ఇంకా ఎంత వరకు వెళుతుంది అనేది తెలియదు. చాలా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాలో అనిల్ చాలా సీన్లు రాశారు. ఎడిటింగ్ రూములో కొన్ని సీన్లు నా వరకు రాక ముందే పక్కన పెట్టేశారు. అందులో బెస్ట్ సీన్స్ 5 మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించాం. మూడో వారం నుంచి వాటితో కలిపి సినిమా రన్ అవుతుంది. ఆ సీన్లు కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. ఈ మూవీ వసూళ్ల పరంగా ఇంకా మంచి రేంజికి వెళ్లాలని ఉందని తెలిపారు.

  100 కోట్లు దాటేసిన ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళు దుమ్ముదులిపేశారు!

  కొత్త ట్రెండ్ మొదలు పెడుతున్నాం

  కొత్త ట్రెండ్ మొదలు పెడుతున్నాం

  ఇంతకు ముందు ఒక సినిమా 50 రోజులు ఆడిందంటే ఒక ఈవెంట్, 100 రోజులకు మరో ఈవెంట్... తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉండేది. ఇపుడు అవన్నీ పోయాయి. ఇపుడు రూ. 50 కోట్ల గ్రాస్, రూ 100 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్, రూ. 100 కోట్ల షేర్... ఇదే నడుస్తోంది. అందుకే ఇక నుంచి థియేటర్లకు కూడా అలాంటి షీల్డులు పంపాలని అనుకుంటున్నాం. ఈ కొత్త ట్రెండ్ మా సినిమాతో మొదలు పెడుతున్నామని దిల్ రాజు అన్నారు.

  ప్రెగ్నెంట్ లేడీలా టెన్షన్ పడ్డారు

  ప్రెగ్నెంట్ లేడీలా టెన్షన్ పడ్డారు

  తమన్నా మాట్లాడుతూ... దిల్ రాజుగారు నా లక్కీ చార్మ్. అప్పుడు హ్యాపీడేస్, ఇపుడు ఎఫ్ 2 రెండు హిట్టయ్యాయి. ఈ మూవీ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాం. ప్రమోషన్స్ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మొహంలో ఎప్పుడూ టెన్షన్ ఉండేది. ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం వెయిట్ చేసినట్లు చాలా టెన్షన్ పడ్డారు. సినిమా బాగానే ఆడుతుంది సర్ అని మేము చెబుతున్నా ఆయనలో ఆ టెన్షన్ పోయేది కాదు. ఈ రోజు సినిమా రూ.100 కోట్లు దాటిన తర్వాత ఆయనలో ఒక నవ్వు కనిపించిందన్నారు.

  English summary
  Dil Raju and Tamanna Speech at F2 Movie 100 cr Press Meet. F2 Fun and Frustration Movie 100crs Gross Blockbuster Press Meet at Hyderabad. Tamannaah Bhatia, Pragathi, Anil Ravipudi, Dil Raju, Kasarla Shyam, Sameer Reddy, Bikkina Thammiraju at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X