మళ్లీ హీరోయిన్స్ పైనే దిల్ రాజు నింద
'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రానికి హీరోయిన్స్ మైనస్ అయ్యారనే కామెంట్ లో కొంత వాస్తవం వుంది, అయితే ఆ టైమ్ కు అంతకు మించిన ప్రత్యామ్నాయం దొరకలేదు అంటూ దిల్ రాజు రీసెంట్ గా మీడియాతో చెప్పుకొచ్చారు. ఆ మధ్య మరో చరిత్ర చిత్రం ఫెయిల్యూర్ కి హీరోయిన్ అనితే మైనస్ అని తేల్చిన దిల్ రాజు మరో సారి ఇలా స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. రామ్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం మొదటి రోజే బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి హీరోయిన్స్ గా చేసారు.
ఇక ఈ చిత్రం సక్సెస్ రేంజ్ గురించి మాట్లాడుతూ ఆయన.."మాస్ ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం వారి అంచనాలను అందుకోలేకపోయింది. కానీ, కుటుంబ ప్రేక్షకులను, యువతను మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. 'ఎ' సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది' అన్నారు. అలాగే ఈ చిత్రం కాస్ట్ కంట్రోల్ చేయడంలో తను ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవమేనని, తనే కాదు...ఈ విషయంలో ఏ నిర్మాతా ఏమీ చేయలేకపోతున్నాడని, ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు నిర్మాతలు మినహాయిస్తే మిగతా నిర్మాతలు ఎవ్వరూ సంతోషంగా లేరు అని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సంస్థ నుంచి వచ్చే ప్రతి చిత్రంలో ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారని, తమ సంస్థపై వున్న ఆ ఇమేజ్ ను బ్రేక్ చేయటానికే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని తీశానని రాజు చెప్పారు. ఇదే సంవత్సరం తమ సంస్థ నుంచి ఓ సంచలనాత్మకమైన చిత్రం రానుందని, ప్రస్తుతం నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో చిత్రాలు చేస్తున్నానని, త్వరలో వేణుశ్రీరామ్ అనే దర్శకుణ్ని పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తానని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











