ప్రభుత్వానికి అండగా.. కేటీఆర్‌కు చెక్ అందించిన దిల్ రాజు
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచం మొత్తం చిన్నాభిన్నామైపోతోంది. విరుగుడు కనిపెట్టలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా కోల్పోతునూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మనదేశంలోనూ కరోనా శరవేగంగా విస్తరిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియాలో ఇప్పటికే దాదాపు ఏడు వేలమందికి కరోనా సోకగా.. రెండు వందలకు పైగా ప్రాణాలను కోల్పోయారు.
కరోనాపై ప్రభుత్వం పోరాటం చేసేందుకు సెలెబ్రిటీలంతా అండగా నిలుస్తున్నారు. ఆయా రాష్ట్రాల హీరోలు.. వారి వారి ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటారు.

తాజాగా దిల్ రాజు తాను ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వానికి పది లక్షల రూపాయలను అందజేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను కలిసిన దిల్ రాజు, శిరీష్.. రూ. పది లక్షల చెక్‌ను అందజేశారు. ఇదే విషయాన్ని తమ అధికారికి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇంతకు ముందు ప్రకటించిన మొత్తం మేరకు.. నేడు కేటీఆర్‌ను కలిసి చెక్ అందజేశామని తెలిపారు.


Click it and Unblock the Notifications











