మహేష్, ఎన్టీఆర్‌లతో దిల్‌రాజు సిన్మాలు
మహేష్‌బాబుతో 2007లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొత్త దర్శకులను, నటీనటులను తెర మీదికి తీసుకువచ్చే దిల్‌రాజు మహేష్ బాబు సినిమాకు మాత్రం సుప్రసిద్ధ దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. దిల్ రాజు మహేష్‌బాబు పోకిరి సినిమా నైజాం, గుంటూరు పంపిణీ హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా ఇంకా కనక వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 2007 లో దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్‌తో మరో భారీ సినిమాను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఆయనకు ఎన్టీఆర్‌కు ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది. ఎన్టీఆర్ అశోక్ సినిమా నైజాం హక్కులు కూడా దిల్ రాజు వద్ద ఉన్నాయి. సిద్ధార్ధ హీరోగా ఆయన నిర్మించిన బొమ్మరిల్లు ఈనెల 9న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications