పోయిన చోటే రాబట్టుకునే ప్లాన్లో ఎన్టీఆర్-దిల్ రాజు!
హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలై నిర్మాతకు నష్టాలను మిగిలిచ్చింది. తర్వాత వచ్చిన ‘రభస' కూడా జూ ఎన్టీఆర్‌కు నిరాశనే మిగిల్చింది.
అప్పటి నుండి కథల ఎంపిక విషయంలో మరింత ఎక్కవ జాగ్రత్త పడుతున్నాడు జూ ఎన్టీఆర్. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తరువాతి సినిమా కూడా ఖరారైటనట్లు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్టీఆర్ తర్వాతి సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా తీసి నష్టపోయిన దిల్ రాజు మళ్లీ అతనితోనే సినిమా తీసి నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నాడట.
జూ ఎన్టీఆర్ కూడా తన సినిమా వల్ల నష్టపోయిన దిల్ రాజుకు మళ్లీ లాభాలు తేవాలనే పట్టుదలతో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తయారు చేసుకున్న కథ, స్క్రిప్టుపై ఇద్దరూ నమ్మకంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి వీరికి బెస్టాఫ్ లక్ చెబుదాం.


Click it and Unblock the Notifications











