కమల్ హాసన్ తన గురువు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మెగా హిట్ ఫిల్మ్ మరో చరిత్ర. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. టీవీల్లో ఆ సినిమాలోని సన్నివేశాలు వచ్చి టీఆర్ పీ రేటింగ్ లు పెంచుకుంటూనే ఉంటాయి. అలాంటి సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన దిల్ రాజుకి వచ్చింది. కెమెరా మెన్ గా పాపులర్ అయిన రవి యాదవ్ ని ఈ క్లాసిక్ రీమేక్ కి దర్శకుడుగా ఎన్నుకున్నట్లు సమాచారం. అలాగే కమల్ హాసన్ పాత్రను వరుణ్ సందేష్ చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ దిల్ రాజు కొత్త బంగారు లోకం సినిమాలో హీరో పాత్రను చేస్తున్నాడు.