twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీగా నష్టపోయిన దిల్ రాజు, అయినా ధైర్యంగా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల విడుదలై పెద్ద సినిమాలు రభస, ఆగడు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దిల్ రాజు భారీ నష్టాల పాలయ్యాడని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఆయన తర్వాతి సినిమా ‘కేరింత' రద్దయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    అయితే ఈ వార్తలను దిల్ రాజు ఖండించారు. స్క్రిప్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటంతో 25 రోజుల షూటింగ్ తర్వాత చిత్రీకరణ ఆపామని, త్వరలోనే మళ్లీ సినిమాను ప్రారంభిస్తామని అన్నారు. ఈ చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తుండగా లవర్స్ ఫేం సుమంత్ అశ్విన్, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి జంటగా నటిస్తున్నారు.

    భారీ నష్టాల పాలయ్యాడా?

    Dil Raju unshaken by losses of big films

    తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ 4లో ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆయన ఎదురులేని శక్తిగా ఎదిగారు. ఆయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారంటే ఆచిత్రం పెద్ద హిట్టవుతుందనే ఒక నమ్మకం కూడా పరిశ్రమలో ఉంది. ఆయన అంచనాలు పర్ ఫెక్టుగా ఉంటాయని నమ్మే వారు చాలా మందే ఉన్నాయి.

    అయితే ‘రభస', ‘ఆగడు' చిత్రాల విషయంలో ఆయన అంచనాలు తలక్రిందులయ్యాయని అంటున్నారు. నైజాం ఏరియాలో ఎన్టీఆర్ నటించిన ‘రభస' చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దిల్ రాజు ఆ చిత్రాన్ని రూ. 12 కోట్లకు కోలుగోలు చేస్తే....దాదాపు 5 కోట్ల మేర నష్టపోయినట్లు చెబుతున్నారు. అదే విధంగా ‘ఆగడు' చిత్రం వైజాగ్ రైట్స్ రూ. 5 కోట్లకుపైగా పెట్టి కొనుగోలు చేసి దాదాపు 3 కోట్ల మేర నష్టపోయాడనే రూమర్లు వినిపిస్తున్నాయి.

    English summary
    There were rumours in media that producer Dil Raju’s upcoming film Kerintha was shelved after Raju’s investments on big film distribution rights like Rabhasa and Aagadu , gave huge losses to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X