దిల్ రాజు కొత్త ప్లాన్ బావుందే.. అందుకే బాలయ్య దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చాడట
నేటితరం టాలీవుడ్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే వారిలో దిల్ రాజు ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాడని అందరికి తెలిసిన విషయమే. అందుకే సక్సెస్ రేటు పెంచే ఈ నిర్మాతతో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. చాలా వరకు దిల్ రాజు తనకు క్లోజ్ గా ఉండే దర్శకులతోనే సినిమాలు చేస్తాడు.
ఆయన స్కూల్ నుంచి వచ్చిన దర్శకుల్లో బోయపాటి ఒకరు. బోయపాటి శ్రీనివాస్ మొదటి సినిమా భద్రను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. గతంలో కొన్నిసార్లు చర్చలు జరిపినప్పటికి వర్కౌట్ కాలేదు. అయితే ఈ సారి అగ్ర దర్శకులు హీరోలు బిజీగా ఉండడంతో చేతిలో పెద్ద సినిమాలు లేవని దిల్ రాజు బోయపాటితో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట.

బాలకృష్ణతో బిజీగా ఉన్న బోయపాటి ఆ తరువాత వర్క్ చేయడానికి రెండు కథలను రెడీ చేసుకున్నాడు గాని ఇంకా నిర్మాతను ఫిక్స్ చేసుకోలేదు. ఇక విషయం తెలుసుకున్న దిల్ రాజు బోయపాటి ఎలాగైనా బాలయ్యతో కమర్షియల్ హిట్టు కొట్టగలడనే నమ్మకంతో అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమాకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టును వచ్చే ఏడాది సెట్స్ పైకి తెచ్చి సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తేవాలని ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











