»   » పాపం నితిన్..పాత ఇంట్లోనే, దిల్ రాజు అందుకే వదలడం లేదా!

పాపం నితిన్..పాత ఇంట్లోనే, దిల్ రాజు అందుకే వదలడం లేదా!

Subscribe to Filmibeat Telugu

నితిన్ వరుసగా క్రేజీ చిత్రాలని ఎంచుకుంటూ కెరీర్ ని చక్కగ్గా మలుచుకుంటున్నాడు. నితిన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో ఛల్ మోహన్ రంగ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగానే నితిన్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. దిల్ రాజునిర్మాణంలో దాదాపు 15 ఏళ్ల తరువాత నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ కూడా ఖరారైంది. రెండు కుటుంబాలు, వివాహం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఛల్ మోహన్ రంగ

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఛల్ మోహన్ రంగ

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. త్రివిక్రమ్ స్వయంగా ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

లిరిసిస్ట్ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఛల్ మోహన్ రంగ చిత్రానికి ఇతడే దర్శకుడు.

దిల్ తరువాత దిల్ రాజుతో

దిల్ తరువాత దిల్ రాజుతో

దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన దిల్ చిత్రం నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతగా దిల్ రాజు ప్రయాణం మొదలైంది ఈ చిత్రంతోనే. ఇప్పుడు దిల్ రాజు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. 15 ఏళ్ల గ్యాప్ తరువాత దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.

 క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

శ్రీనివాస కళ్యాణం చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు.

పాత ఇంటిని వాడుతున్నారు

పాత ఇంటిని వాడుతున్నారు

శతమానం భవతి చిత్రంకోసం రాజమండ్రి లో ఓ ఇంటి సెట్ వేశారు. ఆ ఇంటినే శ్రీనివాస కల్యాణం చిత్రానికి కూడా వాడేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సెంటిమెంట్ కోసమా

సెంటిమెంట్ కోసమా

శతమానం భవతి చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ సెంటిమెంట్ తోనే అదే సెట్ ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు. అనవసరమైన ఖర్చులని తగ్గించడంలో ముందుండే దిల్ రాజు అదే సెట్ ని కాస్త మార్చి ఉపయోగించాలని సూచించినట్లు మరికొందరు చెబుతున్నారు.

English summary
Dil Raju using old home for Nithiin new movie. Srinivasa Kalyanam movie shoot started
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu