Dil Raju Vs C Kalyan: దిల్ రాజు అట్టర్ ఫ్లాప్.. ఆయనకు కామన్ సెన్స్ లేదు.. విరుచుకుపడ్డ సీ కల్యాణ్

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దిల్ రాజు గ్రూప్‌‌పై సీ కల్యాణ్ ప్యానెల్ సభ్యులు విరుచుకుపడ్డారు. దాంతో ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి. డిసెంబర్ 28వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు వర్గాలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఒకవర్గం వేసే ఎత్తుకు మరో వర్గం పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ మాటల యుద్దానికి తెర తీశారు. ఎన్నికల నేపథ్యంగా మీడియాతో తన వర్గం తరుఫున సీ కల్యాణ్, చదలవాడ, తదితరులు మాట్లాడుతూ..

చిన్న నిర్మాతల సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటాం. చిన్న నిర్మాతలకి అండగా నిలబడతాం, వారికి అన్ని విధాలా సహాయం చేస్తాం. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ, చిత్రపురి కాలనీ భూముల వేలం గురించి ప్రస్తావించారు. చిన్న నిర్మాతలంతా కలిసి చిత్రపురి కాలనీలోని 60 ఎకరాల ఆస్తిని కాపాడాం. ఈ విషయంలో అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు అని సీ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Dil Raju Vs C Kalyan
టికెట్ల ధరలు పెంచడానికి తాము వ్యతిరేకం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో టికెట్ల ధరలు పెంచమని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే, చిన్న సినిమాలకు థియేటర్లు దొరికేలా కృషి చేస్తాం. ఇది మా ప్యానెల్ హామీ. చిన్న నిర్మాతలకి న్యాయం జరిగేలా చూస్తాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం అని ఆయన అన్నారు.

ఎదుటి వాళ్లకు మంచి చేయాలనే కోరిక ఉంటే నాయకులు అవుతారు. దిల్ రాజు ఫిలిం ఛాంబర్‌లో పదవిని ఆధిష్టించిన తర్వాత మీరు ఏం చేయలేరు అని నేను ముఖం మీదే చెప్పాను. ఎందుకంటే ఆయనకు నాలుగు బిజినెస్‌లు ఉన్నాయి. ఒకటి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతగా, ఎఫ్‌డీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని కంట్రోల్ చేసినా మరోదానిలో నష్టం వస్తుంది. అందుకే ప్రొడ్యూసర్ అనే వాడు ప్రొడ్యూసర్ హోదాలో ఉంటే గానీ..వాడు న్యాయం చేయగలుగుతారు. ఇతర సెక్టార్‌లో బిజినెస్ ఉంటే.. న్యాయం చేయలేరు అని సీ కల్యాణ్ అన్నారు.

ఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు అట్టర్ ఫ్లాఫ్ చైర్మన్ అవుతాడు. ఆయనకు రియల్‌గా కామన్ సెన్స్ ఉంటే.. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉండి ఈసీ మెంబర్‌గా పోటీ చేయొద్దు. ఈ బాడీ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఛాంబర్, గిల్డ్, సినిమా ఇండస్ట్రీ ఆయన చెప్పుచేతుల్లోనే ఉంది. ఆ విషయం తెలియక, లేకపోతే ఇగో.. లేకపోతే అవతలి వాళ్లను ఏదో చేయాలని ప్రయత్నం. 28వ తారీఖు సాయంత్రం ఏం జరుగుందో అందరికి తెలుస్తుంది. ఎవరి ఫేస్ వాల్యూ ఏమిట తెలుస్తుంది అని సీ కల్యాణ్ విరుచుకు పడ్డారు.

More from Filmibeat

Read more about: c kalyan dil raju tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X