కరీంనగర్ కుర్రాడు దర్శకత్వంలో దిల్ రాజు కొత్త చిత్రం

By Srikanya

కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్దార్ధ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గా ఓహ్ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇక "రుతు" చిత్రం తెలుగులో "న్యూ" టైటిల్ తో సంక్రాంతికి విడుదల అవుతోంది. అలాగే నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. దర్శకుడు తన నిజ జీవితంలో స్కూల్ మేట్ తో అనుభవాల ఆధారంగా ఈ కథని తయారు చేసుకున్నట్లు చెప్తున్నాడు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X