twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాష్ట్ర విభజనతో సమస్య లేదంటున్న దిల్ రాజు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్ ఏమిటనే విషయమై ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. విడిపోయాక పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలివెలుతుందనే వదంతులూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొట్టి పారేసారు.

    రాష్ట్రం విడిపోయినా...తెలుగు సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేదని, రాష్ట్రాలు రెండైనా తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటిగానే ఉంటుందిన ఆయన స్పష్టం చేసారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని స్వామివారిని కోరుకున్నానని రాజు చెప్పారు.

    Dil Raju visits Tirumala Temple

    తన తర్వాతి సినిమా ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.... కొత్త వారితో 'కేరింత' అనే సినిమా చేస్తున్నానని తెలిపారు. అంతేగాకుండా 'లవర్', 'కలిసి ఉంటే కలదు సుఖం' చిత్రాలకు ప్లాన్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. 'కేరింత' చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించబోతున్నారు.

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.స

    English summary
    Tollywood producer Dil Raju visits Tirumala Temple today morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X