Vakeel Saab మ్యానియా.. భార్య పక్కన ఉన్నా కూడా.. పవన్ కోసం థియేటర్లో దిల్ రాజు రచ్చ

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. వ్యక్తిగతంగానూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఫలితంగా సామాన్యులనే కాకుండా సినీ సెలెబ్రిటీలను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక, తన రీఎంట్రీ చిత్రం 'వకీల్ సాబ్'తో ప్రొడ్యూసర్ దిల్ రాజులోని అభిమానం కూడా బయట పడింది. ట్రైలర్ లాంఛ్ సమయంలో థియేటర్‌లో రచ్చ చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా భార్య ముందే రెచ్చిపోయారు. ఆ వివరాలు మీకోసం!

పవన్ కల్యాణ్‌ను ఒప్పించడంలో ఆయన సక్సెస్

పవన్ కల్యాణ్‌ను ఒప్పించడంలో ఆయన సక్సెస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో ఆయనను ఎంతో మంది దర్శక నిర్మాతలు సంప్రదించారు. కానీ, వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి పవన్‌తో రీఎంట్రీ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.

‘వకీల్ సాబ్‌’గా కమ్‌బ్యాక్ అయిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్‌’గా కమ్‌బ్యాక్ అయిన పవన్ కల్యాణ్


సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి వస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇందుకోసం 'వకీల్ సాబ్' మూవీని ఎంచుకున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్.. పవన్ నామజపం

ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్.. పవన్ నామజపం

ప్రపంచ వ్యాప్తంగా 'వకీల్ సాబ్' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పది రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఫ్యాన్స్ ప్రతి థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీంతో కొద్ది రోజులుగా పవన్ నామస్మరణతో రెండు రాష్ట్రాలు ఊగిపోతోన్నాయి. వేరే ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ సైతం సందడి చేస్తున్నారు.

ఇప్పటికే ప్రీమియర్ షోలు.. స్పెషల్ షోలు.. టాక్

ఇప్పటికే ప్రీమియర్ షోలు.. స్పెషల్ షోలు.. టాక్

ఇప్పటికే యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాల్లో 'వకీల్ సాబ్' ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే రివ్యూలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఏరియాల్లో స్పెషల్ షోలు కూడా పడినట్లు తెలిసింది. ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

భార్యతో కలిసి ‘వకీల్ సాబ్’కు వచ్చిన దిల్ రాజు

భార్యతో కలిసి ‘వకీల్ సాబ్’కు వచ్చిన దిల్ రాజు

'వకీల్ సాబ్' మూవీ ద్వారా ప్రొడ్యూసర్ దిల్ రాజులోని మరో కోణం బయట పడింది. అదే.. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అన్న విషయం. ఇటీవల ట్రైలర్ లాంఛ్‌ సమయంలో థియేటర్‌లో ఉద్వేగంతో ఊగిపోయి మాట్లాడిన ఈ బడా నిర్మాత.. పవన్ నామజపంతో సందడి చేశారు. ఇప్పుడేమో ఏకంగా భార్యతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమాను చూస్తున్నారు.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu
ఆమె పక్కన ఉన్నా.. పవన్ కోసం థియేటర్లో రచ్చ

ఆమె పక్కన ఉన్నా.. పవన్ కోసం థియేటర్లో రచ్చ

హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో దిల్ రాజు తన భార్య తేజస్వినితో కలిసి సినిమా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పేపర్లు విసురుతూ.. ఈలలు వేస్తూ.. కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. భార్య పక్కనే ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి మరీ పవన్ సినిమా నడుస్తోన్న సమయంలో రెచ్చిపోయారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X