పవన్-దిల్ రాజు కాంబినేషన్ టాక్, దర్శకుడెవరు?
హైదరాబాద్ : లాభాలు తెచ్చి పెట్టే హీరోలను, దర్శకులతో సినిమాలు తీయడానికి ఎప్పుడూ ముందే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఎప్పటి నుండో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. త్వరలో వీరికాంబిషన్లో సినిమా రాబోతోన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
అయితే ఇది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని సమాచారం. ఇటీవల దిల్ రాజు ఓ స్టోరీతో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాడని, పవన్ విని కాస్త పాజిటివ్ గా స్పందించాడని తెలుస్తోంది. స్క్రిప్టును మరింత డెవలప్ చేయించి ఎలాగైనా ఈ సారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'రభస' చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతను అప్పగించే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సమంత హీరోయిన్. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో సంయుక్తంగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ నెలాఖరున ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












